Home » టయోటా నుండి నానో కంటే చిన్న కార్..ప్రత్యేకతలు ఇవే..!

టయోటా నుండి నానో కంటే చిన్న కార్..ప్రత్యేకతలు ఇవే..!

by AJAY
Ad

ప్రస్తుతం కార్లు కొనేందుకు జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో మనదేశంలో కూడా ఇంటింటికి కారు ఉండే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్లు పెరిగితే విలాసవంతమైన జీవితం అలవాటు పడుతుంది కానీ ఆ కార్ల వల్ల వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎన్ని కార్లు పెరిగితే అంత పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అయితే పొల్యూషన్ పెరగకుండా ఉండేలా ఇప్పుడు మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోయాటో కూడా సీ +పాడ్ పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లోకి లాంచ్ చేసింది.

Toyoto c+pad car

Toyoto c+pad car

అయితే ఇప్పటికే చాలా కంపెనీలు మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి అందులో వింత ఏముంది అనుకోవచ్చు కానీ ఈ ఎలక్ట్రిక్ కారు మిగతా కార్ల కంటే చాలా స్పెషల్. ఎందుకంటే టాటా లాంచ్ చేసిన నానో కార్ కంటే ఈ కార్ చిన్నగా ఉంది. అంతే కాకుండా నానో కార్ లో నాలుగు సీట్లు ఉంటే ఈ కార్ లో రెండు సీట్ కు మాత్రమే ఉన్నాయి.

Advertisement

Advertisement

ఇక నానో కార్ పెట్రోల్ కార్ కాగా ఈ కార్ ఎలక్ట్రికల్ కార్ కావడం విశేషం. ఇక ఈ కారులో ఉండే ప్రత్యేకతల విషయాన్ని వస్తే…..ట్రాఫిక్ మరియు కారు పార్కింగ్ కోసం ఎదురు అయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్ ను డిజైన్ చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక కారు బరువును తగ్గించేందుకు బాహ్య ప్యానల్ ను పూర్తిగా ప్లాస్టిక్ తో తయారు చేశారు. టయోటా సీ+పాడ్ ధర రూ.11.75 లక్షలుగా ఉంది.

Visitors Are Also Reading