స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ అందించకుండా చేయటం కష్టమైపోతోంది. చాలాసార్లు ఫోన్ లాగేసు కొందామని ప్రయత్నిస్తూ ఉంటే ఏడవడం, కోపంతో వస్తువులు విసిరేయటం చేస్తుంటారు. అలాంటప్పుడు స్క్రీన్ టైం తగ్గించడం చాలా కష్టంగా మారుతోంది.ఎక్కువ సమయం స్క్రీన్ వైపు చూస్తోంటే వచ్చే అనర్దాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మనసు మళ్ళించడం ఒక పని మీద నుండి మనసు మళ్ళించడం లో స్మార్ట్ ఫోన్ లో ముందుంటాయి. బాల్యంలో పిల్లల మెదడు అభివృద్ధి చెందే సమయం. అలాంటప్పుడు అనవసర విషయాలు అందులో చేరి మనసు మళ్ళించి మెదడు పనితీరు మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువ.
Advertisement
నీలికాంతి: తేరా నుండి వచ్చే నీలి కాంతి కేవలం కళ్ళకే కాదు మెదడు కణాలకు కూడా హానికరమే. దానివల్ల ఒకే పని మీద దృష్టి నిలపడం అసాధ్యం అవుతుంది. రాత్రిపూట ఫోన్ వాడే చాలామందిలో అలసట, బలహీనత ఏర్పడడానికి నీలి కాంతి కూడా ఒక కారణమే.
Advertisement
డిజిటల్ ఆమె శ్యాయా:
ప్రతి సంఘటన అప్లోడ్ చేస్తూ ఉండే వాళ్లకు ఒకానొక దశలో నిజ జీవితం లో జరిగే సంఘటనలో మరచిపోయే ప్రమాదం ఉంటుంది.
పరిష్కారాలు:-
పిల్లలు ఎంత సేపు ఫోన్ వాడుతున్నారు అనేది పెద్దలు గమనిస్తూ ఉండాలి. మెసేజ్ చేస్తున్నారా? లేక కాల్స్ మాట్లాడుతున్నారా? ఎంత సేపు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకోవాలి. పిల్లలకే ఆన్లైన్ క్లాసులు ఉన్నట్లయితే. కళ్ళకు రక్షణ ఇచ్చే అద్దాలు తీసుకురావాలి. ఆన్లైన్ క్లాసులకి తప్ప మిగతా ఫోన్లకి చేతికి ఇవ్వకూడదు. అదే కాదు ఏదైనా శరీరక శ్రమ కలిగించే ఆటల్లో భాగస్వాములను చేయాలి.లౌడ్ స్పీకర్ పెట్టుకొని మాట్లాడేలా ప్రోత్సహించాలి. అలాగే చెవికి దగ్గరగా పెట్టుకో వద్దని సూచించాలి. రాత్రిపూట ఫోన్ అసలు ముట్టుకోవద్దు.