రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు. ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రష్మీ ఓ వైపు సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్ గా కూడా అదరగొడుతున్నారు. ఇదిలా ఉంటే.. రష్మి గౌతమ్ కి తాజాగా ఓ బంఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
ఈ భామకు బిగ్ బాస్ సీజన్ 7 లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చిందని.. రెమ్యునరేషన్ మాత్రం భారీగా అడుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సారి హోస్ట్ గా రానా వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా రష్మి తన సోషల్ మీడియాలో రాస్తూ.. మాంసహారులపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. గత కొద్ది సంవత్సరాలుగా రష్మి మూగ జీవాల సంరక్షణ కోసం పాటు పడుతున్న విషయం విధితమే. అందులో భాగంగా వీలున్నప్పుడల్లా ట్వీట్స్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా తాజాగా పెరిగేవి తినండి.. పుట్టేవి కాదు.. అంటూ మరో ట్వీట్ చేసింది. పలువురు నెటిజన్లు రెస్పాండ్ అవ్వుతూ.. సూపర్ రష్మి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
మరోవైపు రష్మీ గౌతమ్ రెమ్యునరేషన్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఒక్కో షోకి రూ.1.5 నుంచి రూ.2లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదులలో అందాలను కనువిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ మధ్య రష్మీ హీరోయన్ గా నటించిన గుంటూరు టాకీస్ కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయిందంటున్నారు కొందరు అభిమానులు. ఇక మొత్తానికి రష్మీ బిగ్ బాస్ లో ఎలా అలరిస్తుందో వేచి చూడాలి మరి.