టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రతో పాల్గొన్ననందమూరి తారకరత్న కొద్ది దూరం నడిచాడు. ఆ తరువాత అకస్మాత్తుగా కిందపడిపోయిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు తారకరత్నను స్థానిక కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు అత్యవసర చికిత్స అందించి మెగురైన వైద్య చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్నకు అత్యంత ఖరీదైన వైద్యమును అందిస్తున్నట్టు నందమూరి, నారా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం.
Advertisement
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం.. తెలుగుదేశం పార్టీ వారు తారకరత్న చికిత్సకి పూర్తి ఖర్చులు భరిస్తున్నట్టుగా తెలుస్తోంది. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. కాబట్టి పూర్తి ఖర్చును తానే భర్తిస్తాను అన్నట్టుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారట. ఈ విషయాన్ని తారకరత్న భార్యతో కూడ చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఇతర నందమూరి ఫ్యామిలీతో పోల్చినట్టయితే తారకరత్న ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాడట. అందుకు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు అని కొందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Also Read : మురళీమోహన్, జయసుధ అంతటి స్టార్లు అయ్యారంటే కారణం ఆయనే..!!
మరికొందరూ మాత్రం చంద్రబాబు మంచి మనస్సుతో ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొంటున్నారు. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా తారకరత్న హాస్పిటల్ బిల్లులను చెల్లించేందుకు ముందుకు రావడం అభినందనీయమనే చెప్పాలి. తారకరత్న పరిస్థితి ప్రస్తుతం కాస్త పరవాలేదు అన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఉన్నటువంటి తారకరత్నను పరామర్శించిన విషయం తెలిసిందే. తాాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు వెల్లడించారు.
Also Read : ‘ఆంధ్రుడు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా..?