సౌతాఫ్రికా వేదికగా జరిగిన అండర్ -19 మహిలల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయంసాధించి ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ ట్రోపిని ముద్దాడింది. ఈ విజయంలో తెలుగు అమ్మాయి గొంగిడి త్రిష కీలక పాత్ర పోషించింది. లో స్కోరింగ్ మ్యాచ్ లో ఆమె టాప్ స్కోరర్ గా నిలిచి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చింది. 69 పరుగుల లక్ష్య ఛేదన లో టీమిండియా 3 ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.
Advertisement
తెలంగాణకి చెందిన త్రిష మాత్రం నిలకడగా ఆడింది. స్వల్ప స్కోరు కావడంతో ఆచితూచి ఆడింది. మొత్తం 29 బంతులలో 3 ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి టీమిండియా టాప్ స్కోరర్ గా నిలిచింది. అంతేకాదు.. హ్రిషిత బసుతో కలిసి మూడో వికెట్ ని కీలకమైన 46 పరుగులను జోడించింది. అంతకు ముందు ఫీల్డింగ్ లో చురుకుగా క్యాచ్ ని పట్టి ఇంగ్లండ్ కెప్టెన్ గ్రేస్ స్క్రివెన్స్ ని పెవిలీయన్ కి పంపించింది. గ్రేస్ ప్రపంచ కప్ టోర్నీలో పరుగుల వరద కురిపించింది. టోర్నీ మొత్తం ఆద్యంతం రాణించడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపిక అయింది. గ్రేస్ ని అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ పంపించింది త్రిష.
Advertisement
Also Read : మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రపంచ కప్ టోర్నీలో నిలకడగా రాణించింది. గ్రూపు దశలో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గొంగడి త్రిష(51 బంతుల్లో 57 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచి టీమిండియాని గెలిపించింది. టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తూ పలువురు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల వయస్సులోనే అండర్ 16 లో సత్తా చాటిన త్రిష 12 ఏళ్ల వయస్సులో రాష్ట్ర అండర్ 19 జట్టుకు ఆడింది. అంచెలంచలుగా ఎదుగుతూ అందరీ ప్రశంసలను అందుకుంటుంది.