తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు శుభవార్త. ఒకటికి మించి జవాబులు ఉన్న ప్రశ్నలకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షలో 7 మార్కులు కలపాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పును అమలు చేయాలని పోలీసు నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది.
Advertisement
హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుతో మరికొంతమంది అభ్యర్థులు తర్వాతి స్టేజ్ కు ఎంపికకానున్నారు. ఈ నిర్ణయంతో రాత పరీక్షలో అర్హత సాధించే మరికొంతమంది అభ్యర్థుల జాబితాను సోమవారం నుంచి అధికారులు వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు.
Advertisement
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పార్ట్-2 అప్లికేషన్ సమర్పణకు గడువు కల్పించనున్నారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఫిజికల్ టెస్ట్ పరీక్షలను నిర్వహిస్తామని నియామక బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే, గతంలో జరిగిన ప్రీలిమినరీ రాత పరీక్షల సమయంలో మల్టీ ఆన్సర్స్ ఉన్న ప్రశ్నలకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
read also : I LOVE U నాగచైతన్య : టాలీవుడ్ హీరోయిన్