Home » టెస్ట్ ల్లో నెంబర్ వన్ కి చేరుకున్న టీమిండియా.. కేవలం రెండు గంటలే..!

టెస్ట్ ల్లో నెంబర్ వన్ కి చేరుకున్న టీమిండియా.. కేవలం రెండు గంటలే..!

by Anji
Ad

భారత క్రికెట్ జట్టు టెస్ట్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చిందా..? అంటే అవుననే సమాధానాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఐసీసీ వెబ్ సైట్ లో భారత్ కి టాప్ ర్యాంకు ఇచ్చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఉన్నట్టుండి భారత్ కి ఐసీసీ మొదటి ర్యాంకు ఎందుకు కేటాయించింది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అనూహ్యంగా నెంబర్ వన్ అయింది. కానీ ఆ ముచ్చట కేవలం రెండు గంటలకే పరిమితమైంది. ఐసీసీ వెబ్ సైట్ లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల భారత్ అగ్ర స్థానంలోకి వచ్చింది తప్ప వాస్తవం కాదని వెల్లడించింది. భారత్ 115 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినట్టు ఐసీసీ వెబ్ సైట్ చూపించడంతో అగ్రస్థానంలో దానిని స్క్రీన్ షాట్ తీసుకొని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెంటనే ఐసీసీ ఆ సమస్యను గుర్తించి పరిష్కరించింది.  

Advertisement

Also Read :  కారు ప్రమాదం తరువాత తొలిసారి స్పందించిన పంత్.. ఏమన్నాడంటే..?

ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మెరుగైన స్థితిలో ఉంది. అకస్మాత్తుగా భారత్ ఉన్నట్టుండి నెంబర్ ఎలా అయిందో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐసీసీ వెబ్ సైట్ లో తలెత్తిన సమస్య వల్లే టీమిండియా పైకి ఎగబాకినట్టు తరువాత తేటతెల్లమైంది. ఇక తప్పును గుర్తించినటువంటి ఐసీసీ 126 పాయింట్లో ఆస్ట్రేలియాకే అగ్రస్థానంలో ఉంచుతూ జాబితాను అప్ డేట్ చేసింది. దీంతో భారత్ 115 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలల జరిగే నాలుగు టెస్ట్ ల సిరీస్ ని భారత్ క్వీన్ స్వీప్ చేస్తే మాత్రం ఆసీస్ ను వెనక్కి నెట్టి టీమిండియా దూసుకొచ్చే అవకాశముంది. అదేవిధంగా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ పైనల్ కి చేరుకోవడానికి మార్గం చాలా సులభతరమవుతుంది.  

Also Read :   అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

Visitors Are Also Reading