Home » కారు ప్రమాదం తరువాత తొలిసారి స్పందించిన పంత్.. ఏమన్నాడంటే..?

కారు ప్రమాదం తరువాత తొలిసారి స్పందించిన పంత్.. ఏమన్నాడంటే..?

by Anji
Ad

టీమిండియా కీలక ఆటగాడు, వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఇటీవలే కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే కారు ప్రమాదం తరువాత మొదటిసారిగా స్పందించాడు రిషబ్ పంత్. ప్రమాదం చోటు చేసుకున్న 17 రోజుల తరువాత తన శస్త్ర చికిత్స విజయవంతం అయింది.. పంత్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇక అదే సమయంలో కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి కృత జ్ఞతలు తెలిపాడు. డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదానికి గురైంది.

Advertisement

ఢిల్లీ నుంచి రూర్కీలోని తన ఇంటికి వెళ్తుండగా పంత్ కారు ఢిల్లీ-డెహ్రాడూన్ హైవే డివైడర్ ని ఢీ కొట్టింది. కారు ప్రమాదం తరువాత పంత్ ని డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రలో చేర్చారు. అతని వెన్ను, కాళ్లు తదితర చోట్ల గాయాలయ్యాయి. కొంత కాలం డెహ్రాడూన్ లో ఉన్న రిషబ్ పంత్ ని విమానంలో ముంబైకి తరలించారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పంత్ లిగమెంట్ సర్జరీ జరిగింది. పంత్ చికిత్సకి అయ్యే ఖర్చు మొత్తాన్ని బీసీసీఐనే స్వయంగా భరించింది. 

Also Read :  విజయ్ దళపతి వారసుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 

Advertisement

రిషబ్ పంత్ తాజాగా ట్వీట్ చేస్తూ.. “ నాకు లభించిన మద్దతు, ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. నా శస్త్ర చికిత్స  చాలా విజయవంతమైంది. నేను కోలుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేయడాన్ని సంతోషిస్తాను. ముందు ఉన్న సవాళ్లంన్నింటినీ ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి బీసీసీఐ జై షా, ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నాడు. పంత్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఖాతాలో స్పైడర్ మ్యాన్, అవేంజర్ కార్టూన్ చిత్రాలను పంచుకున్నాడు. 2023లో మైదానానికి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. లిగమెంట్ సర్జరీ జరిగింది.. కాబట్టి పంతు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంద అనేది ప్రస్తుతానికి నిర్ణయించలేదు. 

Also Read :   మహిళల టీ-20 అండర్ 19 ప్రపంచ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్..!

Visitors Are Also Reading