Home » అచ్చం సౌందర్య మాదిరిగానే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

అచ్చం సౌందర్య మాదిరిగానే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

by Anji
Ad

అలనాటి అందాల తార.. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు సౌందర్య. ముఖ్యంగా గ్లామర్ షోలకు ఆమడ దూరంలో ఉంటూ.. తెలుగు అమ్మాయి మాదిరిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. అమ్మోరు సినిమాత ఒక్కసారిగా ఈ హీరోయిన్ కెరీర్ టర్న్ అయింది. ఈ సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. 

soundaryajunior

Advertisement

 

మనవరాలి పెళ్లితో తెలుగు తెరకు పరిచయం అయింది. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించారు. మహానటి సావిత్రి తరువాత ఆ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే.. సౌందర్య మాత్రమే. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే విమాన ప్రమాదంలో అకస్మాత్తుగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సౌందర్య మరణించడంతో సినీ పరిశ్రమకు తీరని లోటు. ఇప్పటికీ ఆమె రూపం ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో సౌందర్య పోలికలతో ఉన్నటువంటి ఓ అమ్మాయి వీడియో హల్ చల్ సృష్టిస్తోంది. 

Also Read :  బాలకృష్ణ వసుంధరల వివాహ పత్రికను మీరు చూశారా.. పెళ్లి ఎక్కడ జరిగిందంటే ?

ఇక ఆ వీడియోలో ఉన్న అమ్మాయి అచ్చం సౌందర్య మాదిరిగానే కనిపిస్తోంది. అంతేకాదు.. ఆమె చేస్తున్న వీడియోలు అన్ని కూడా సౌందర్య నటించిన చిత్రాలే కావడం విశేషం. సౌందర్య మాటలకు తగినట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. ఆ సౌందర్యాన్ని మరిపిస్తుంది. ఆ వీడియోలు చూసిన నెటిజన్లు ఇంతకు ఆ అమ్మాయి ఎవ్వరు అని తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు. Chitra_jii2 ఇన్ స్టా ఖాతా ఉన్నటువంటి ఈ అమ్మాయి సౌందర్య మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ యువతి పేరు చిత్ర. ఆమెకు ఇప్పటివరకు 2లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సౌందర్య లాగే ఉన్న ఈ అమ్మాయి.. ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాలను మళ్లీ సోషల్ మీడియాలోకి తీసుకొస్తుంది.  

Also Read :   “దృశ్యం” లో వెంకటేష్ చిన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

Visitors Are Also Reading