ప్రస్తుతం ల్యాప్ టాప్ లు చాలా తేలికగా, స్లిమ్ గా ఉన్నాయి. కానీ ఇదివరకు అంటే ల్యాప్ టాప్ లు తొలుత తయారు చేసిన సమయంలో ఇలా అస్సలు ఉండేవే కావు. భారీ సైజులో ఉండేవి. వాటి బరువుతో పాటు ధర కూడా భారీగానే ఉండేది. ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ప్రపంచంలోని మొట్టమొదటి మొబైల్ కంప్యూటర్ ఓస్బోర్న్ 1 1981లో నిర్మించారు. దీనిని ఓస్బోర్న్ కంప్యూటర్ కార్పొరేషన్ అనే సంస్థ తయారు చేసింది. ఇక ఆ సమయంలో ఇది విజయవంతమైన పోర్టబుల్ మైక్రో కంప్యూటర్. ఓస్బోర్న్ 1 ఐదు అంగుళాల స్క్రీన్ ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇందులో రెండు ఫ్లాపీ డ్రైవ్ లు, మోడెమ్, బ్యాటరీ ప్యాక్, కీ బోర్డు ఉంటాయి. మొట్ట మొదటి ట్యాప్ ఇప్పటి ల్యాప్ టాప్ ల మాదిరిగా సన్నగా లేదని ఓస్బోర్న్ 1 ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. మొదటి ట్యాప్ టాప్ బరువు 11 కిలోగ్రాములు. అనగా ఒక ల్యాప్ టాప్ బరువు 5 మ్యాక్ బుక్ ప్రోకి సమానం అన్నమాట. ఈ ల్యాప్ టాప్ పెద్దగా హిట్ కాలేదు. కానీ మొదటిసారి పోర్టబుల్ పర్సనల్ కంప్యూటర్ పవర్ ని అందులో ప్రజలు చూసారు. తొలిసారిగా ప్రజలు తమతో కంప్యూటర్లను తీసుకెళ్లగలిగారు. ఇది విడుదల సమయంలో ఓస్బోర్న్ 1 ధర $1,795 ఉండేది. అనగా భారత కరెన్సీలో దాదాపు రూ.1,46,775 వాస్తవానికి ల్యాప్ టాప్ కనిపించే తొలి పోర్టబుల్ ల్యాప్ టాప్ గ్రిడ్ కంపాస్ 1101.
Also Read : నాటు నాటు పాటకు ప్రముఖ హాస్యనటుల డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
Advertisement
1983లో విడుదలై..’ క్లామ్ షెల్’ డిజైన్ ని కలిగి ఉంటుంది. అనగా కీ బోర్డు ముందు స్క్రీన్ ముడుచుకుంటుంది. కానీ అధిక ధర కారణంగా ఈ ల్యాప్ టాప్ పెద్దగా విజయవంతం కాలేదు. ఇంతకు ముందు వరకు ల్యాప్ టాప్ లను సామానుగా మాత్రమే చూసేవారు. సాధారణ పీసీతో పోల్చితే అవి పోర్టబుల్ గా ఉండేవి. కానీ భారీగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో వాటిని చాలా సులభంగా తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఇక ఆ తరువాత 1989లో కాంపాక్ ఎల్ టీ ఈ 286 విడుదలయ్యాయి. మొదటి నోట్ బుక్ పీసీ స్థితిని కలిగి ఉన్నారు. ఇక అప్పుడు ప్రజలు వాటిని ఇష్టపడడం ప్రారంభించారు. Apple మొదటి ల్యాప్ టాప్ 1989లో మార్కెట్ లోకి వచ్చింది. కానీ అది చిన్నది ఏం కాదు. సామాను విభాగంలో కూడా ఉంచబడింది. కానీ బ్యాటరీ, స్క్రీన్ చాలా బాగుండటం విశేషం. 1991లో Apple Power Book ల్యాప్ టాప్ ల శ్రేణిని పరిచయం చేసింది. పవర్ బుక్ 100, పవర్ బుక్ 140 మరియు పవర్ బుక్ 170 ఈ సిరీస్ లో ప్రారంభించబడ్డాయి. కంపెనీ తొలి పోర్టబుల్ పీసీ కంటే విజయవంతమైంది. తరువాత 1992లో ఐబీఎం తొలి థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్ లను పరిచయం చేసింది. మోడళ్లు కొన్ని 700, 700c, 700t. Apple PowerBook 100 సిరీస్ తో పాటు ఆధునిక ల్యాప్ టాప్ ల తరహాలో రూపొందించారు. ప్రస్తుతం మనం ఉపయోగించే ల్యాప్ లు రూపొందించారు.