బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో హీరోగా పరిచయమైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నిట్లోనూ రాణిస్తూ టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇదే ఉత్సాహాన్ని ఇప్పటికీ చూపిస్తున్న ఆయన వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నందమూరి హీరో వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే యుఎస్ లో రికార్డు సాధించింది.
Advertisement
Advertisement
అయితే బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 54 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. బాలయ్య కెరీర్ లో ఇది అధికం. దీంతో బాలకృష్ణకు వీరసింహారెడ్డి సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అయితే సినిమాకు తొలి రోజు మిశ్రమ స్పందన రావడం, నిన్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదలవడంతో రెండో రోజు వీరసింహారెడ్డి కలెక్షన్ భారీగా తగ్గిపోయింది. 70 శాతానికి పైగా వీరసింహారెడ్డి కలెక్షన్ పడిపోయినట్టు సమాచారం.
వీర సింహారెడ్డి సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల మేర షేర్ వసూలు చేయగా, రెండో రోజు మాత్రం కేవలం రూ. 5 కోట్ల మేర షేర్ మాత్రమే వసూలు చేసిందని సమాచారం. దీంతో ఈ పండగ రోజుల్లో వీరసింహారెడ్డి కలెక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరోవైపు వాల్తేరు వీరయ్య సైతం సినిమా సైతం తొలి రోజు రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. షేర్ కూడా రూ. 28 కోట్ల మేర ఉందట.
READ ALSO : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్…గ్రామ, వార్డు సచివాలయాల్లో 15వేల పోస్టులు..వివరాలు ఇవే