భారత క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో అతని మెరుపు ఇన్నింగ్స్ తో స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నాడు. ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు సూర్యకుమార్ యాదవ్. టీ 20లలో శ్రీలంకపై ఓ హాఫ్ సెంచరీ, ఓ సెంచరీ బాదడంతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 900 రేటింగ్ పాయింట్లను కూడా దాటేశాడు. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియా క్రికెటర్ గా సూర్య కుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. టీ-20ల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు ఉన్నటువంటి ఆటగాడిగా డేవిడ్ మలాన్ పేరిట ఉన్నటువంటి రికార్డును సూర్య త్వరలో బ్రేక్ చేయనున్నాడు.
Advertisement
శ్రీలంక పై మెరుపు ఇన్నింగ్స్ తో శతకం బాదిన సూర్య తన కెరీర్ లోనే తొలిసారి ఐసీసీ ర్యాకింగ్స్ లో 900 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. ఇప్పటివరకు డేవి్ మలాన్, అరోన్ ఫించ్ మాత్రమే టీ20ల్లో 900కి పైగా రేటింగ్ పాయింట్స్ సాధించారు. సూర్య ఖాతాలో ప్రస్తుతం 908 పాయింట్లు ఉన్నాయి. డేవిడ్ మలాన్ ఖాతాలో 915 పాయింట్లు ఉన్నాయి. సూర్య టీ 20లల్లో మరో అద్బుతమైన ఇన్నింగ్ ఆడితే మలాన్ రేటింగ్ పాయింట్లను అధిమించడం ఖాయంగా కనిపిస్తోంది.
Advertisement
మరోవైపు అరోన్ ఫించ్ 2019 జులైలో 900 పాయింట్లను సాధించగా.. మలాన్ 2020లో 915 రేటింగ్ పాయింట్లను సాధించాడు. ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్నటువంటి మహ్మద్ రిజ్వాన్ ఖాతాలో ప్రస్తుతం 836 పాయింట్లున్నాయి. మిగతా ఆటగాళ్ల ఎవ్వరికీ కూడా 800 రేటింగ్స్ పాయింట్స్ కూడా లేకపోవడం గమనార్హం. గతంలో భారత్ తరపున విరాట్ కోహ్లీ 897 రేటింగ్ పాయింట్లు సాధించడమే ఇప్పటివరకు భారత్ తరపున అత్యుత్తమం. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ 854 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. భారత్ తరపున మూడు ఫార్మాట్లలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో 917, వన్డేల్లో 911 రేటింగ్ పాయింట్స్ సాధించారు. టెస్టుల్లో భారత్ తరపున ఇప్పటివరకు విరాట్ కోహ్లీ, గావస్కర్ మాత్రమే 900 రేటింగ్స్ పాయింట్స్ సాధించారు.
Also Read : సరికొత్త రికార్డు సృష్టించిన ఉమ్రాన్ మాలిక్.. తొలి భారత బౌలర్ గా..!