Home » సరికొత్త రికార్డు సృష్టించిన ఉమ్రాన్ మాలిక్.. తొలి భారత బౌలర్ గా..!

సరికొత్త రికార్డు సృష్టించిన ఉమ్రాన్ మాలిక్.. తొలి భారత బౌలర్ గా..!

by Anji
Ad

టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. వన్డేలలో భారత్ జట్టు తరుపున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్ గా రికార్డుల్లో నిలిచాడు. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జనవరి 10న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గంటకు 156 కి.మీ. వేగంతో బంతిని విసిరి ఈ ఫీట్ సాధించాడు మాలిక్. శ్రీలంక ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగవ బంతికి ఈ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో ఉమ్రాన్ మాలిక్ తన రికార్డునే తానే అధిగమించాడు. 

Advertisement

శ్రీలంకతో జరిగిన టీ-20 సిరీస్ లో 155 కి.మీ. వేగంతో బంతిని సంధించి భారత్ తరుపున టీ-20లలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు. అయితే అంతకు ముందు 1999 ప్రపంచ కప్ లో మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ గంటకు 154.5 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసాడు. శ్రీలంక పర్యటన వరకు భారత్ తరపున అత్యంత వేగవంతమైన బౌలర్ రికార్డు శ్రీనాథ్ పేరిటే ఉండేది. అదేవిధంగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గంటకు 153.7 వేగంతో బంతిని వేసాడు. మహ్మద్ షమీ 153.3 వేగంతో బంతిని సంధించగా.. జస్ప్రీత్ బుమ్రా గంటకు 152.2 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. 

Advertisement

Also Read :  శ్రీలంక మ్యాచ్‌లో హైడ్రామా.. క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ

Manam News

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సైతం భారత్ తరుపున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్ గా ఉమ్రాన్ మాలిక్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో కశ్మీర్ ఎక్స్ ప్రెస్ 157 వేగంతో బంతిని సంధించాడు. లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ లో 157.3 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. 2003 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్ 161.3 కి.మీ. వేగంతో బంతిని సంధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మాత్రం అలాగే ఉంది. షోయబ్ అక్తర్ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో వేచి చూడాలి మరి. 

Also Read :  శతక్కొట్టిన కోహ్లీ.. సచిన్ రికార్డు సమం..!

 

Visitors Are Also Reading