Home » శతక్కొట్టిన కోహ్లీ.. సచిన్ రికార్డు సమం..!

శతక్కొట్టిన కోహ్లీ.. సచిన్ రికార్డు సమం..!

by Anji
Ad

టీమిండియా శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ తొలి వన్డేలో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో శతకం బాదాడు. దీందో ప్రపచ రికార్డులు నమోదు అయ్యాయి. గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ వన్డేలో భారీ స్కోరుకు బాటలు వేశాడు విరాట్ కోహ్లీ. మొదటి నుంచే దూకుడుగా ఆడిన కోహ్లీ మొత్తం 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 113 పరుగులు చేసాడు. దీంతో వన్డేలలో 45, అంతర్జాతీయ క్రికెట్ లో 75 సెంచరీలు సాధించి.. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు కింగ్  కోహ్లీ. 

Advertisement

సొంత దేశంలో 20 సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్ మెన్ గా గుర్తింపు పొందాడు. స్వదేశంలో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 20 సెంచరీలు కొట్టిన బ్యాటర్ గా రికార్డు నమోదు చేశాడు కోహ్లీ. కేవలం 99 ఇన్నింగ్స్ లలో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. అయితే సచిన్ టెండూల్కర్ 20 సెంచరీలకు 160 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. సొంత గడ్డపై అత్యధిక శతకాలు బాదిర వారిలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హసీం ఆమ్లా (69) 14 శతకాలతో రెండో స్థానంలో, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (151) ఇన్నింగ్స్ లలో 14 శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. 

Advertisement

Also Read :   ఆస్పత్రి బెడ్‌ పైన ఉన్న పంత్‌ కు BCCI శుభవార్త..రూ.21 కోట్లు ఇవ్వాలని నిర్ణయం!

ఒకే టీమ్ పై అత్యధిక సెంచరీలతో సచిన్ రికార్డును కోహ్లీ సమం చేసాడు. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మీద 9 సార్లు సెంచరీలు సాధించాడు. సచిన్ ఆస్ట్రేలియా మీద 9 సెంచరీలు కొట్టగా.. రోహిత్ శర్మ, ఆసీస్ పై 8 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇక అదే ఫామ్ ని కొనసాగిస్తూ.. గువహటిలో జరుగుతున్న ఫస్ట్ వన్డేలో శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేసాడు. 80 బంతుల్లోనే 11 ఫోర్లు, 1 సిక్సర్ తో సెంచరీకి చేరువయ్యాడు. దీంతో టీమిండియా 373 పరుగులు చేసి శ్రీలంక ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ముందుంచాడు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డును కూడా తనఖాతాలో వేసుకున్నాడు. 44 పరుగులకు చేరుకోగానే ఓ ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 

Also Read :  బాలకృష్ణ కి రూ.25లక్షల ఖరీదైన వాచ్ ని బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా ? 

Visitors Are Also Reading