Home » సూర్య భీకర సెంచరీ.. రికార్డులన్నీ బద్దలు! టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

సూర్య భీకర సెంచరీ.. రికార్డులన్నీ బద్దలు! టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!

by Bunty

IND VS SL : భారత్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 91 పరుగులతో చిత్తయింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 228 పరుగులు చేసింది. అనంతరం లక్ష చేదనకు దిగిన శ్రీలంక, 16.4 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది. అయితే, మూడో టి20 టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య అద్భుతమైన సెంచరీ సాధించాడు.


ఓవరాల్ గా ఈ మ్యాచ్ ల్లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య, 112 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో ఏకంగా తొమ్మిది సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టి20లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్ ఓపెనింగ్ బ్యాటర్ గా సూర్య రికార్డులకెక్కాడు. సూర్య ఇప్పటివరకు టి20 లో మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.

తొలి సెంచరీ ఇంగ్లాండ్ పై చేయగా, న్యూజిలాండ్ పై రెండో సెంచరీ, తాజాగా శ్రీలంకపై తన మూడో సెంచరీ నమోదు చేశాడు. అదేవిధంగా టి20లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా ఈ ముంబైకర్ నిలిచాడు. అంతకుముందు 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్ గా టి20లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా సూర్య నిలిచాడు. తొలి స్థానంలో నాలుగు సెంచరీలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా మాక్స్వెల్, మున్రో, డేవిజీ, చెరో మూడు సెంచరీలతో ఉన్నారు.

READ ALSO : Waltair Veerayya Trailer : ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ట్రైలర్‌..అన్నయ్య వస్తే పూనకాలు, అడుగేస్తే అరాచకాలు

Visitors Are Also Reading