తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. తెలంగాణలోని పలు జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించి హైకోర్టు వేర్వేరుగా 6 ప్రకటనలను జారీ చేసింది. వీటికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 11, 2023 నుంచి ప్రారంభం కానుంది.
Advertisement
ఒక సారి పోస్టుల వివరాలు పరిశీలిస్తే, జిల్లా కోర్టులో అత్యధికంగా 1226 అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఏడవ తరగతి పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. పదవ తరగతి లోపు వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఉన్నత విద్యార్హత కలిగిన వారు అనర్హులు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం 271 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు వివిధ జిల్లాల్లో 76 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి మొత్తం 63 పోస్టులు, కార్డ్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 97 కాగా, ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
పైన పేర్కొన్న అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 11వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 600 ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 15. రాత పరీక్షలు మార్చిలో నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ తేదీ ఫిబ్రవరి 15, 2023 డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ https://tshc.gov.in/getNotifications సంప్రదదించాల్సి ఉంటుంది.
READ ALSO : రోజాది నోరుకాదు.. మున్సిపాలిటి చెత్త కుప్ప : నాగబాబు