Home » రోజాది నోరుకాదు.. మున్సిపాలిటి చెత్త కుప్ప : నాగబాబు

రోజాది నోరుకాదు.. మున్సిపాలిటి చెత్త కుప్ప : నాగబాబు

by Bunty
Ad

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న వారిలో రోజా ఒకరు. అచ్చమైన తెలుగు అమ్మాయిగా ఆమె విభిన్నమైన తరహాలో ఎన్నో పాత్రలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె బిజీగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ షోలో కూడా ఆమె కొన్నాళ్లు జడ్జిగా కొనసాగారు. అయితే నాగబాబుతో కూడా ఆమెకు షోలో విభేదాలు వచ్చినట్లు ఆ మధ్య రకరకాలు వార్తలు వచ్చాయి.

Advertisement

ఇది ఇలా ఉండగా, తాజాగా మెగా బ్రదర్ నాగబాబు, మంత్రి రోజాపై ఘాటు వాక్యాలు చేశారు. రోజా నోరు మున్సిపాలిటీ కుప్ప అంటూ నిప్పులు చెరిగారు. ఏపీ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ల జీవితాలు మట్టి కొట్టుకుపోయాయి. నువ్విలా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకో. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో చూడాలి అంటూ ఘాటుగా స్పందించారు.

Advertisement

“నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి నోటికి వచ్చినట్లు వాగిన కూడా, ఆఫ్ కోర్స్ నా గురించి మాట్లాడావు, నేను లెక్క చేయను. మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, మా అన్నయ్య చిరంజీవి గురించి నోటికి వచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, ఒకటే ఒక కారణం ఉంది. నీ నోటికే మున్సిపాలిటీ కుప్ప తొట్టికి పెద్ద తేడా లేదు, చూస్తా చూస్తా మున్సిపాలిటీ కుప్ప తొట్టిని గెలకరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో చూడు’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు.

READ ALSO : బాలయ్యకు పెను ప్రమాదం.. హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

Visitors Are Also Reading