Home » సంతోషంలో నాగార్జున కొడుకుగా చేసిన చిన్నోడు గుర్తున్నాడా.. చూస్తే ఆశ్చర్యపోతారు..!!

సంతోషంలో నాగార్జున కొడుకుగా చేసిన చిన్నోడు గుర్తున్నాడా.. చూస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో చాలామంది బాల నటులుగా చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతారు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ వారు కనిపిస్తే ఎవరు గుర్తుపట్టరు. అలా బాల నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ చిన్నోడు కూడా ఒక హీరో రేంజ్ కటౌట్ తో ఉన్నాడు.. ఇంతకీ ఆ బుడ్డోడెవరు..

santosham-child-artist

santosham-child-artist

చేసిన సినిమాలు ఏంటో చూద్దాం.. సినిమాల్లో అమాయక చూపులు, అల్లరి చేష్టలు వంటి పాత్రల్లో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసును దోచిన అనేకమంది బాలనటులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా షామిని, బేబీ శాలిని, మీనా , నిత్యామీనన్, శ్రీదేవి వంటి నటులే కాకుండా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా రాణిస్తున్నారు. మరి కొంతమంది ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

Advertisement

also read:త్రిషకు ఆ నటుడంటే చాలా ఇష్టమట..ఆయన ఎవరంటే..!

అలాంటి వ్యక్తుల్లో ఈ బుడ్డోడు కూడా ఒకరు. అక్కినేని నాగార్జున హీరోగా గ్రేసి సింగ్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రలో నటించిన సంతోషం మూవీ 2002లో విడుదలైంది. ఇందులో డైరెక్టర్ కె విశ్వనాథ్, ప్రభుదేవా కీలకమైన పాత్రలో నటించారు. వీరితోపాటు నాగార్జున తనయుడిగా ఒక బుడ్డోడు కూడా మనకు పరిచయమే. అప్పట్లో ఈ చిన్నోడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ చిన్నోడు ఎవరని ఆలోచిస్తున్నారా.. అతగాడి పేరు అక్షయ్.1997 మే 13న జన్మించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన అక్షయ్ , తెలుగులో 12 సినిమాలు నటించాడు. బాలీవుడ్ లో 35 చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా కన్నడ చిత్రాలలో కూడా మెరిసిన అక్షయ్ బచ్చు 2005లో అంజనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్షయ్ కేవలం చిత్రాల్లోనే కాకుండా ప్రకటనలో కూడా కనిపించాడు. ఆయనకు మరో టాలెంట్ కూడా ఉంది. సింగింగ్ కూడా బాగా చేయగలడు ఇప్పటికే పలు స్టేజ్ షోలు కూడా చేశాడు. అక్షయ్ కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నాగార్జున నటించిన సంతోషం మాత్రమే కాకుండా, ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో కూడా కనిపించాడు. అలాంటి అక్షయ్ ఇప్పుడు ఒక హీరో రేంజ్ కటౌట్ కలిగి ఉన్నాడు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

also read:

Visitors Are Also Reading