Kajal re-entry: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలతో తెరను పంచుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఎంతో ఆకట్టుకుంటుంది. లక్ష్మీ కళ్యాణం అనే మూవీ ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, చందమామ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. చందమామ మూవీ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమును వివాహం చేసుకున్న కాజల్ ప్రెగ్నెంట్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
also read:త్రిషకు ఆ నటుడంటే చాలా ఇష్టమట..ఆయన ఎవరంటే..!
రీసెంట్ గా ఒక బిడ్డకు జన్మనిచ్చి ఇంట్లోనే ఉంటూ ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటుంది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. కాజల్ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇస్తున్నా కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం తగ్గేదెలే అంటుందట.. అది ఏంటో తెలుసుకుందాం.. కాజల్ అంతకుముందు ఒక్కో సినిమాకు మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషకం తీసుకునేది. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి విరామం ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా కానీ రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేది లేదు అంటుందని సమాచారం. రిఎంట్రీలో కూడా మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉందట.
ఈమె ఇంత పారితోషికం అడిగినా గాని సినిమా అవకాశాలు పెద్ద ఎత్తున వస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు . శంకర్ డైరెక్షన్ లో కమలహాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్2 చిత్రంలో కీలకపాత్ర నటిస్తోంది కాజల్. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఈ సినిమాలో చేస్తున్న సమయంలోనే కాజల్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ తరుణంలోనే ఈ సినిమాలో కాజోల్ పాత్రకు మరొక్కరిని తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ లేదని కాజల్ పేర్కొంది . పెళ్లికి ముందు గ్లామర్ పాత్రల్లో చేసిన కాజల్ రీ ఎంట్రీ తర్వాత గ్లామర్ పాత్రలకు కాస్త దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కాజల్ క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం భారతీయుడు సినిమాలో కాజల్ తో పాటు రకుల్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
also read: