రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టిడిపి పార్టీ బలం తెలంగాణలో తగ్గుతూ వచ్చింది. దీంతో ఆ పార్టీలో ఉన్న నేతలు అంతా టిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఈ తరుణంలో చంద్రబాబు తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓ అడుగు ముందుకు వేశారు. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లాలో పెట్టిన బహిరంగ సభ సక్సెస్ అవడంతో పార్టీ వదిలి ఇతర పార్టీలలోకి వెళ్లిన నేతలపై కన్నేశారు. వారిని ఎలాగైనా మళ్ళీ టిడిపిలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.
Advertisement
Also read;కొత్త ఏడాదిలో ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!
Advertisement
ఈ తరుణంలోనే నిజామాబాద్ జిల్లాపై దృష్టి పెట్టింది టిడిపి అధిష్టానం. ఈ జిల్లా నుంచి కొంత మంది నేతలు వారితో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది . ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంత క్యాడర్ ఉండడం వల్ల అక్కడ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ టిడిపి పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నిజామాబాద్ లో బహిరంగ సభ పెట్టడానికి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గర్ వాపసి కింద టిడిపి పార్టీలో కొనసాగిన వారిని మళ్లీ తీసుకొచ్చేందుకు ఆలోచన చేస్తున్నారు.
ఈ తరుణంలో అన్ని నియోజకవర్గల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు టిడిపి సమాయత్తమవుతోంది . ఈ విధంగా వారు అనుకున్నట్లుగా అన్ని జరిగితే మాత్రం బాన్సువాడ నిజామాబాద్ రూరల్,బోధన్ నియోజకవర్గాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టనుంది. ఈ తరుణంలో నిజామాబాద్ లో 2023 జనవరి చివరి వారంలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ బహిరంగ సభకు టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు పలువురు నాయకులను ఆహ్వానించి వేరే పార్టీకి వెళ్లిన వారిని తిరిగి టిడిపిలో చేరుస్తారనే టాక్ వినిపిస్తోంది.
Also read;నల్ల మిరియాలు ఆహారంలో కాకుండా చప్పరిస్తే కలిగే లాభాలెన్నంటే..?