Home » నల్ల మిరియాలు ఆహారంలో కాకుండా చప్పరిస్తే కలిగే లాభాలెన్నంటే..?

నల్ల మిరియాలు ఆహారంలో కాకుండా చప్పరిస్తే కలిగే లాభాలెన్నంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా మన ఇంట్లో ఏదైనా కర్రీ వండుకుంటే అందులో తప్పకుండా మిరియాల పొడి అనేది వేస్తూ ఉంటాం. ఈ పొడి వల్ల ఆ కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి మిరియాలు ఆహారంలో కాకుండా డైరెక్ట్ గా నోటి ద్వారా చప్పరించి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మరి ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా మనకు జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు మిరియాలు వాడడం చూస్తూ ఉంటాం.

Advertisement

Also read;ఈ ఇంటి చిట్కాలతో బరువు తగ్గడం చాలా ఈజీ..!

Advertisement

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. నల్ల మిరియాలను మసాలా లాగా కాకుండా నోటి ద్వారా తీసుకుంటే ఫ్యాటీ సేల్స్ రాకుండా కాపాడుతుందట. ఈ మిరియాల లో విటమిన్ ఏ,సి,కె , ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకటి రెండు నల్ల మిరియాలను నేరుగా నోట్లో వేసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం క్రమబద్ధం అవుతుందట.

సన్నబడాలి అనుకునేవారు ఆహారంలో మిరియాలు చేర్చుకొని తినడం చాలా మంచిది. వెజిటేబుల్ సలాడ్స్ పైన నల్ల మిరియాల పొడిని చల్లి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నల్ల మిరియాల పొడిని టీ లో కలుపుకొని తాగితే గొంతులో గరగర తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే ఇప్పటినుండి ప్రతి ఒక్కరు మీ రోజువారీ ఆహార పద్ధతుల్లో ఈ నల్ల మిరియాలను కూడా చేర్చుకొని అనేక ప్రయోజనాలను పొందండి.

Also read;తల్లి కాబోతున్న మరో నటి.. అభిమానులు శుభాకాంక్షలు..!

Visitors Are Also Reading