బిగ్ బాస్ ఫేం సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోహెల్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆయనకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా అతడు నటించిన సినిమా ‘లక్కీ లక్ష్మణ్’. ఈనెల 30న ఇవాళ ఈ మూవీ రిలీజ్ కానుంది. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఏ.ఆర్.అబి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు.
Advertisement
ఈ సందర్భంగా ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం నిర్వహించారు. ఈవెంట్ లో బిగ్ టిక్కెట్ ను డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి సోహెల్ తండ్రి సలీమ్ కి అందించారు. ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరు ఈరోజు నన్ను సింగరేణి ముద్దుబిడ్డ అంటారు. ఆ పేరు రావడానికి కారణం మా నాన్న. ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుంది అంటారు. కానీ నా సక్సెస్ వెనకాల మా ఫాదర్ ఉన్నారు. ప్రతి ఒక్క కొడుకు విజయం వెనకాల ఒక నాన్న ఉంటాడని నిరూపించాను” అని వెల్లడించారు.
Advertisement
మరోవైపు, యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర కామెంట్లు పెట్టే వారిపై కూడా సోహెల్ విరుచుకుపడ్డారు. “నన్ను ఏమైనా అనండి. కానీ, తల్లిదండ్రులను తిడుతూ కొన్ని బూతులు ఉంటున్నాయి. దయచేసి తిట్టకండి. ఈసారి తిడితే మాత్రం కొడకల్లారా మిమ్మల్ని, యూట్యూబ్ లో దొరకబట్టి మీ ఇంటికి వచ్చి తరిమి తరిమి కొడతా నా కొడకల్లారా. నన్నే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ నైనా, ఏ హీరోనైనా సరే, వాళ్ళని ఏమైనా అనండి సినిమా గురించి అనండి, సినిమా గురించి అనండి తప్ప గలీజ్ బూతులు తిడితే వెతికి మరీ కొడతా నా కొడకల్లారా. నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్లకు చెప్తున్నా” అంటూ సోహెల్ హెచ్చరించారు.
READ ALSO : Rishabh Pant : కారు యాక్సిడెంట్లో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్కు గాయాలు