Home » Happy Birthday Wishes, Quotes, Kavithalu in Telugu పుట్టిన రోజు శుభాకాంక్షలు

Happy Birthday Wishes, Quotes, Kavithalu in Telugu పుట్టిన రోజు శుభాకాంక్షలు

by Anji
Ad

Happy Birthday Wishes, Quotes, Kavithalu in Telugu పుట్టిన రోజు శుభాకాంక్షలు: సాధారణంగా పుట్టిన రోజు అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. మనం జరుపుకున్నా.. లేదా జరుపుకోకున్నా పర్వాలేదు. కానీ ఇది మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. కొందరూ ప్రతి ఏడాది సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటారు. మరికొందరూ చిన్నతనంగా భావించి జరుపుకోరు. కానీ వృద్ధుల పుట్టిన రోజులు మాత్రం మరిచిపోలేనివి. ఈ రోజుల్లో పిల్లలు కూడా ఆనందిస్తారు. ఉపాధ్యాయులు కూడా వారి జన్మదిన వేడుక రోజున పాఠశాలలో వారిని తిట్టరు. చాలా మంది శుభాకాంక్షలు చెబుతుంటారు. 

 

అందులో కొందరూ బహుమతులు కూడా పొందుతారు. దాదాపు అందరూ వారి తల్లిదండ్రులచే ఆశీర్వదించబడుతారు. ప్రియమైన వారు, బంధువులు, స్నేహితులు తదితర వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంటారు. మేము కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలను కవితల ద్వారా మిమ్మల్ని మీరు మీ వాళ్లను మరింత ప్రేమ పూర్వకంగా, విభిన్నంగా పుట్టిన రోజు శుభాాకాంక్షలు తెలియజేసేవిధంగా మీకు సహాయపడాలన్నది మా ప్రయత్నం. పుట్టిన రోజు శుభాకాంక్షలు, కవితలు, నాన్న కోసం, అక్క కోసం, అమ్మ కోసం, చెల్లి కోసం, అన్నయ్య లేదా తమ్ముడు కోసం, భర్త లేదా భార్య కోసం, అదేవిధంగా స్నేహితుల కోసం  పుట్టిన రోజు శుభాకాంక్షలు, కవితలు మీతో పంచుకోవడమే మా ఉద్దేశం.

Advertisement

wish-you-happy-birthday-wishes-in-telugu

Wish You Happy Birthday wishes, Quotes in Telugu

  • ఒక వ్యక్తి జీవితంలో గొప్ప రోజులు రెండే రెండు. ఒకటి పుట్టిన రోజు, మరొకటి పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు. పుట్టిన రోజు శుభాకాంక్షలు.
  • బహుమతి కంటే అది ఇచ్చిన వారిని ఎక్కువగా ప్రేమించు, అప్పుడు ప్రతిబంధం ఎంతో అండగా కనిపిస్తుంది పుట్టిన రోజు శుభకాంక్షలు. 
  • దేవుడు మనకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు. మనం బాగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • బహుమతులు కాదు.. బంధాలు ముఖ్యం. నా ఆత్మీయ బంధువుకు జన్మదిన శుభాకాంక్షలు. 
  • నీకు జన్మదిన శుభాకాంక్షలు ఎంతో విభిన్నంగా చెప్పాలని, అందమైన వాక్యాలను వెతుకుతూ.. ఏవి దొరక్క చివరికీ ఇలా చాలా ప్రేమతో చెబుతున్నా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు ఆనందంగా ఆహ్లాదకరంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

Happy-Birthday-wishes-in-Telugu-text

Birthday-Wishes-in-Telugu

Happy Birthday Kavithalu in Telugu

  • హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా..

నువ్వు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు

 మరెన్నో జరుపుకోవాలని

మనసారా కోరుకుంటున్నాను. 

 

  • కోటి కాంతుల చిరునవ్వులతో 

భగవంతుడు నీకు నిండి నూరేళ్లు ఇవ్వాలని 

మనస్ఫూర్తిగా కోరుకుంటూ 

Advertisement

పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

 

  • పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో

జ్ఞాపకాలు మిగిల్చే గుర్తులెన్నో

నా చిన్ని జీవితంలో ఎన్ని పరిచయాలున్నా 

కలకాలం ఉండే తియ్యని స్నేహం నీది 

అలాంటి నా ప్రియా నేస్తానికి 

నా పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

 

  • ప్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహాన్ని ఆశీస్తూ.. 

మీరు ఎప్పుడూ సంతోషంగా 

ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. 

హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

 

  • మీ భవిష్యత్ మరింత శోభాయమానంగా ఉన్నంతగా, 

మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, 

సమున్నతంగా సంపూర్ణ ఆయురోగ్యాలతో 

నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ.. 

పుట్టిన రోజు శుభాకాంక్షలు

  • నిన్నటి కన్నా రేపు బాగుండాలి 

    రోజును మించి రోజు సాగాలి 

    దిగులు నీడలు తాకకుండా ఉండాలి

    జీవితం ఆనందమయం కావాలి 

    పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

 

 

  • ఎదుటి వారిని నవ్వించడం కంటే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏముంటుంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవించు. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • ఏ ఒక్కరి కోసమో నిన్ను నీవు మార్చుకోకు, నువ్వు నీలాగే ఉండు, సంతోషంగా ఉండు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • నీవు ఎప్పుడైనా అధైర్యపడితే మళ్లీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధమే అని తెలియజేస్తూ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
  • ఉప్పొంగిన ఉత్తేజంతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు.
  • దేవుడి దీవెనలతో.. అమ్మ, నాన్న ఆశీస్సులతో.. కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాలతో మీ కళలు, కోరికలు నెరవేరాలని.. మీ సంతోషాలు పండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయ పూర్వక జన్మదిన్మ దిన శుభాకాంక్షలు. 
  • పుట్టిన రోజున ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • గతాన్ని మరిచిపోండి, భవిష్యత్ పై ఆశాజనకంగా ఉండండి. మీకు అంత మంచే జరుగుతుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. 
  • మీ పుట్టిన రోజుతో పాటు మిగిలిన 365 రోజులు కూడా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          
           Also Read: Best Telugu Quotes and Quotations in Telugu
Visitors Are Also Reading