Home » Dec 25th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 25th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

శ్రీసత్యసాయి మడకశిర నియోజకవర్గంలో ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చేతివాటం చూపించారు. లంచం ఇస్తేనే మాస్టర్‌లో పేరు నమోదు చేస్తానని, ఉపాధి హామీ విజయ్ కుమార్ కూలీల దగ్గర డబ్బు వసూలు చేస్తున్నాడు.

గుంటూరు పొన్నూరు ఆర్టీసీ డిపో దగ్గర ఫ్లెక్సీ వివాదం నెలకొంది. రంగా విగ్రహావిష్కరణ ఫ్లెక్సీని తొలగించిన ఆర్టీసీ అధికారులు. ఫ్లెక్సీ తొలగింపుపై వంగవీటి రంగా అభిమానులు ఆందోళన కు దిగారు.

Advertisement

టీవీ నటి తునీషా శర్మ బలవన్మరణం కేసులో పురోగతి. కో ఆర్టిస్టు షిజన్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తునీషా శర్మ బలవన్మరణం చేసుకునేలా ప్రేరేపించినట్లు షిజన్‌ఖాన్‌పై అభియోగం నమోదు అయ్యింది.

అమెరికాలో మంచు తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్‌ వల్ల ఇప్పటివరకు 21 మంది చనిపోయారు. అమెరికాలో మైనస్‌ 50 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. 20 కోట్ల మందికి మంచు తుఫాన్‌ ముప్పు. 20 లక్షలకు పైగా ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా. అమెరికాలో 6వేల విమాన సర్వీసులు రద్దు చేశారు.


ప్రముఖ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో చలపతిరావు చనిపోయారు. కృష్ణా జిల్లా బల్రివర్రులో 1944 మే 8న జన్మించిన చలపతిరావు జన్మించగా ఆయన 1200 సినిమాలకు పైగా నటించారు. చలపతిరావు.

Advertisement

శాంతి, కరుణ, సహనం, ప్రేమ ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు..శత్రువునైనా క్షమించే గొప్ప గుణం,సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైనది…క్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలి అంటూ రాష్ట్ర, దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.

చెన్నై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో కోవిడ్ ర్యాపిడ్ టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటు చేశారు. విదేశాల నుండి వస్తున్న పర్యాటకులకు వైద్య సిబ్బంది ర్యాపిడ్ టెస్ట్ లు చేస్తున్నారు.

క్రిస్‌మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ చర్చి.. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు…నేడు తెల్లవారుజామునుంచి ప్రార్థనలు మొదలయ్యాయి. విద్యుత్ దీపాలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి వెలిగిపోతోంది.

రాష్ట్రం లోని పోలీస్ అభ్యర్థులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల వయోపరిమితి 2 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉత్కంఠ భరితంగా జరిగిన బంగ్లాదేశ్ భారత్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.

Visitors Are Also Reading