సావిత్రి తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. ఆమె అభిమానులతో మహానటిగా కీర్తించబడింది. సావిత్రి గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగ నాయుళ్లు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి ఆమెను పెంచాడు. ప్రధానంగా ఆమె అందం, అభినయం, ఎప్పటికీ మరిచిపోలేనివి. సావిత్రి ఎంతో సహజంగా నటించి అవధులులేని అభిమాానాన్ని సొంతం చేసుకున్నారు.
Advertisement
ఒకప్పటి స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ లకి పోటీగా నటించి అందరి మన్నలను అందుకున్నారు. కేవలం ఆమె కోసం సినిమాకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉండేవారు. పోస్టర్ పై సావిత్రి ఫోటో కనిపిస్తే చాలు ఆ సినిమా థియేటర్స్ హౌస్ పుల్ అయ్యేవట. కేవలం సావిత్రి కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు చాలా మందే ఉండేవారట. సినిమాలతోనే కాదు.. సేవా గుణంలో కూడా తనకు తానే సాటి అనే విధంగా నిరూపించికున్నారు సావిత్రి. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించడమే కాదు.. దర్శకురాలిగాను తన ప్రతిభను చాటుకున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తిరుగులేని నటిగా స్థిరపడ్డారు. ముఖ్యంగా ఆమె జీవితం అనుకున్నంత సాఫీగా ఏమి సాగలేదు. జెమినీ గణేష్ ని పెళ్లాడిన తరువాత ఆమె జీవితం ఊహించని విధంగా మారిపోయింది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలుండడంతో కష్టాలను అనుభవించింది.
Advertisement
Also Read : Good Morning Quotes, Messages, Wishes, WhatsApp status in Telugu
చివరికి మద్యానికి బానిసై.. బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. ముఖ్యంగా సావిత్రికి మల్లెపూలు, వర్షం అంటే చాలా ఇష్టం అంట. అదేవిధంగా ఆమెకు క్రికెట్, చెస్ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు.. ఆమె దగ్గర ఏనుగు దంతాలతో చేసిన చెస్ బోర్డు కూడా ఉండేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ జరిగితే ఆమె తప్పకుండా వెళ్లి చూసేవారట. వెస్టిండిస్ క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు అయినటువంటి గ్యారీ సోబర్స్ కి సావిత్రి వీరాభిమాని అట. అదేవిధంగా శివాజీ గణేశన్ తో కలిసి సినిమా తారల క్రికెట్ పోటీలలో ఆమె పాల్గొన్నారు. చివరిగా సావిత్రి తీవ్ర అనారోగ్యానికి గురై ఏడాది పాటు కోమాలో ఉండి 46 సంవత్సరాల వయస్సులో తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
Also Read : జబర్దస్త్ మానేసి హోటల్ ప్రారంభించిన ఆర్పీ…..సంపాదన తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..?