సాధారణంగా ప్రతీ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ లకు ముందు వేలం జరిగే విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి మెగా వేలం జరిగితే.. మరోసారి మిని వేలం జరుగుతుంటుంది. వేలం ఏదైనా సరే.. కానీ అందరి చూపు ఆమె వైపే ఉంటుంది. ఆమె ఎంతో చలాకీగా ఉంటూ.. జట్టు సభ్యులను ఎంపిక చేసుకోవడంలో మేనేజ్ మెంట్ సలహాలు తీసుకుంటూ వేలం జరుగుతున్నంత సేపు చాలా హడావిడిగా కనిపిస్తుంటారు. ఆమె కావ్య మారన్. కోచిలో జరిగిన ఐపీఎల్ మిని వేలంలో కూడా ఆమె పాల్గొన్నారు. ఇంగ్లాండ్ కీలక బ్యాట్స్ మెన్ హ్యారీ బ్రూక్ ను రూ.13.25 కోట్లకు దక్కించుకున్నారు. అదేవిధంగా భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్ ని కూడా రూ.8.25 కోట్లకు కొనుగోలు చేశారు. తాాజాగా జరిగిన ఐపీఎల్ మినివేలంతో మరోసారి కావ్యమారన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
అసలు కావ్య మారన్ ఎవరు..? ఆమెకు ఎందుకు అంత క్రేజ్ అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కావ్య మారన్ ఎవరో ఒకసారి పరిశీలించినట్టయితే సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల గారాల పట్టి కావ్యమారనే. 1992లో ఆగస్టు 06న చెన్నైలో పుట్టారు. అందరూ అల్లారు Muద్దుగా కావ్య అని పిలుస్తుంటారు. ఆమెకు బిజినెస్ పై ఆసక్తి ఉండడంతో ఎంబీఏ పూర్తి చేశారు. ముఖ్యంగా ఏవియేషన్, మీడియా అంటే ఆమెకు చాాలా ఇష్టం. ప్రస్తుతం సన్ నెట్ వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కళానిధి మారన్ 1990లో చిన్న మ్యాగజైన్ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ చిత్రానికి కళానిధి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read : సామ్ కరణ్ పై కాసుల వర్షం.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో..!
Advertisement
కావ్య మారన్ కుటుంబానికి కేవలం బిజినెస్ మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా మంచి పలుకుబడే ఉంది. కావ్య వాళ్ల తాత మురసోలి మారన్ డీఎంకే నుంచి కేంద్ర మంత్రిగా పని చేశారు. అదేవిధంగా బాబాయ్ దయానిధి మారన్ కూడా గతంలో లోక్ సభకు ఎన్నికయ్యారు. మురసోలి మారన్ కి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్వయానా మామయ్య. వీరికి సన్ గ్రూప్ లో జెమినీతో పాటు పలు భాషల్లో ఛానళ్లు ఉన్నాయి. సన్ డైరెక్ట్ డీటీహెచ్ కూడా ఈ గ్రూపునకు చెందిందే కావడం విశేషం. రెడ్ ఎఫ్.ఎం.తో పాటు దేశం మొత్తంలో కలిపి దాదాపు 70 రేడియో స్టేషన్లున్నాయి. భారతదేశం అంతటా వీరి బిజినెస్ లు కొనసాగుతున్నాయన్నమాట.
Also Read : ధోనీకి షాక్…CSK కెప్టెన్ గా బెన్ స్టోక్స్
మరోవైపు ఇదివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్నటువంటి న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ని ఈ సారి ఎంపిక చేసుకోలేదు. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ని హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫామ్ లో లేనందువల్ల విలియమ్సన్ ని పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో రూ.14 కోట్లకు విలియమ్సన్ ని ఎస్ఆర్ హెచ్ కొనుగోలు చేసింది. అతను సన్ రైజర్స్ తరపున 76 మ్యాచ్ లు ఆడి 2101 పరుగులు చేసాడు. తాాజాగా జరిగిన వేలంలో గుజరాత్ అతన్ని రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. పక్కా వ్యూహంతోనే విలియమ్సన్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ని హైదరాబాద్ జట్టు ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2022లో కేవలం 13 మ్యాచ్ లు ఆడిన మయాంక్ 196 పరుగులు మాత్రమే చేసినప్పటికీ పంజాబ్ జట్టును ఆరో స్థానంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ప్రధానంగా హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా మయాంక్ కి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Also Read : కావ్య పాప బిగ్ స్కెచ్…SRH లోకి డేంజర్ ప్లేయర్లు..!