Home » CONNECT MOVIE REVIEW IN TELUGU : “క‌నెక్ట్” సినిమా రివ్యూ…న‌య‌న్ హిట్టు కొట్టిందా…?

CONNECT MOVIE REVIEW IN TELUGU : “క‌నెక్ట్” సినిమా రివ్యూ…న‌య‌న్ హిట్టు కొట్టిందా…?

by AJAY
Ad

Connect Movie Review in Telugu: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా నయనతార కనెక్ట్ అనే సస్పెన్స్ థ్రిల్ల‌ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రానికి అశ్విన్ భార్య కావ్య రామ్ కుమార్ కథను అందించారు. సినిమాలో నయనతార మరియు వినయ్ రాయ్ ప్రధాన పాత్రల‌లో నటించారు. నేడు విడుద‌లైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం..

ప‌రిచ‌యం :

Advertisement


Nayanatara Connect Movie Story  in Telugu: క‌థ‌ 

సినిమాలో జోసెఫ్ బినోయ్ (వినయ్ రాయ్) ఓ ప్రముఖ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తుంటాడు. జోసెఫ్ భార్య సుసాన్ (నయనతార) హోం మేకర్…. ఇక వీరిద్దరికీ ఓ ముద్దుల కూతురు అన్నా (హానియా నసీఫ్) ఉంటుంది. అన్నా చదువుతో పాటు సంగీతం పై ఉన్న ఆసక్తితో సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో అన్నా లండన్ లోని హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్ లో సీటు సంపాదిస్తుంది. కానీ ఇంతలోనే కరోనా కేసులు పెరిగి లాక్ డౌన్ విధిస్తారు. అయితే కరోనా సమయంలో వైద్యులకు చికిత్స అందిస్తూ డాక్టర్ జోసెఫ్ బినోయ్ చనిపోతాడు. దాంతో అన్నా తన తండ్రి జోసెఫ్ తో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. ఆత్మతో మాట్లాడటమే కనెక్ట్ సినిమా… ఇక సినిమాలో అన్నా త‌న తండ్రి ఆత్మ‌తో ఎలా క‌నెక్ట్ అయ్యింది ఆ త‌ర‌వాత ఏం జ‌రిగింది అన్నదే ఈ సినిమా కథ.

Advertisement

Connect Movie Review and Rating  in Telugu

Connect Movie Review and Rating  in Telugu

Nayanatara Connect Movie Review and Rating  in Telugu

విశ్లేష‌ణ :
సాధారణంగా సస్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు చాలా సింపుల్ కథతో తెర‌కెక్కుతాయి. కనెక్ట్ సినిమా కథ కూడా అలాంటిదే… సినిమా కథలోకి వెళ్లే వరకు కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ప్రేక్షకులను సీట్లో కూర్చోపెడుతుంది. కూతురు అన్నా శరీరంలోకి ఆత్మ ప్రవేశించిన తర్వాత సీన్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తర్వాత ఏం జరగబోతుంది… ఆత్మతో ఎలా కనెక్ట్ అవుతుంది అన్న ఆసక్తి నెలకొంటుంది. అయితే ఈ సినిమాను తక్కువ నిడివితో తెరకెక్కించారు. క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయిన కొంత సమయం తర్వాత సినిమా పూర్తవుతుంది. కానీ ప్రేక్షకులు ఇంకా ఏదైనా ఉందేమో అని వేచి చూస్తారు. కాబట్టి సినిమా క్లైమాక్స్ విషయంలో కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక సినిమాలో ఎక్కడా సాగదీత సన్నివేశాలు లేకుండా థ్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. వినయ్ రాయ్ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేవిధంగా నయనతార తన పాత్రకు న్యాయం చేసింది. నయనతార తండ్రి పాత్రలో నటించిన సత్యరాజ్ …. ఫాదర్ ఆగస్టయిన్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అన్నా పాత్రలో నటించిన హాలియా అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆత్మలను పిలిపించడం ఆ తర్వాత తరిమేయడం అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చాలామందికి కనెక్ట్ అవుతుంది.

also read :  హీరో గోపిచంద్ భార్య ఎవ‌రో తెలుసా..? వాళ్ల ప్రేమక‌థ‌లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా..?

Visitors Are Also Reading