Good Morning Quotes, Messages, Wishes, WhatsApp status in Telugu: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ముఖంపై చిన్న చిరునవ్వుతో ఎవరైనా గుడ్ మార్నింగ్ చెబితే చాలు ఇక ఆ రోజు అంతా చాలా ఉత్సాహంగా గడుస్తుంది. అలాంటిది మనకు నచ్చిన వారు లేదా మనం మెచ్చిన బంధువుల, స్నేహితులు, శ్రేయాభిలాషులకు మనమే మనసారా శుభోదయం అంటూ సందేశాలను పంపించినట్టయితే వారికి ఆ రోజు అంతా చాలా సంతోషంగా గడిచిపోతుంది. ఇక మనం పంపించే సందేశాలలో కొన్ని అందరికీ పంపించేందుకు వీలు ఉంటాయి. మరికొన్ని మాత్రం అందరికీ పంపించలేము. సందేశాత్మకంగా ఉన్నటువంటి కొన్నింటిని ఇప్పుడు మనం చూద్దాం.
Good Morning Quotes in Telugu
Advertisement
Good Morning Quotes, Messages, Wishes, WhatsApp status in Telugu
- పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతలు మనల్ని గొప్పవారిగా తయారు చేస్తాయి. శుభోదయం.
- అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అందుకోసమే అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా పయణించండి.. గుడ్ మార్నింగ్.
- ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం.. ఇతరులను నవ్విస్తే అది ఆనందం.. నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ పదికాలాల పాటు నడిస్తే అది ఆనందం. నువ్వు నవ్వుతూ.. ఇతరులను నవ్విస్తూ 10 కాలాల పాటు నడిస్తే అది అనుబంధం. ఈ రోజుని నీవు చిరునవ్వుతో ప్రారంభించు.. గుడ్ మార్నింగ్.
- కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. శుభోదయం.
- ఆశ మనిషిని బతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. శుభోదయం.
- ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం, డ్రామా లేదా నెగిటివిటీ తదితర వాటి ప్రభావం నీపై అస్సలు పడనీయకూడదు. నువ్వు ఎప్పటికీ నీలాగే ఉండు.. గుడ్ మార్నింగ్.
- ఎవరి పట్ల అయినా ద్వేష భావం ఉంటే వారిని ప్రేమిస్తున్నట్టు అస్సలు నటించకూడదు. అది మీ ఇద్దరికీ కూడా మంచిది కాదు.. శుభోదయం.
- నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు. శుభోదయం.
- మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతీ రోజు తెల్లవారుతుంది. శుభోదయం.
- మన శక్తి కంటే సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది. శుభోదయం.
Advertisement
Good Morning Wishes in Telugu
ఉదయం వేళలో ఫోటోల రూపంలో ఉన్నటువంటి సందేశాలకు బదులుగా చక్కని కొటేషన్స్ ఉన్నవి అవి మీ స్నేహితులకు పంపించాలని మీరు భావిస్తున్నట్టయితే.. మరికొన్ని మీ కోసం కొన్ని కొటేషన్స్ తీసుకొచ్చాం. వాటిని ఇప్పుడు చూద్దాం.
- పట్టుదల ఉంటే చాలు దారి ఏదైనా సరే.. గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయం సూర్యుడిని ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్.
- మరణం మనిషిని ఒకసారే చంపుతుంది. కానీ మనస్సు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. ధైర్యంగా ఉండండి. గుడ్ మార్నింగ్.
- జీవితంలో మనం అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అదే భవిష్యత్. శుభోదయం.
- పొగిడే వాళ్లు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు.. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు. గుడ్ మార్నింగ్.
- సమస్య తీర్చాలని దేవుడిని కోరుకోవడం కన్నా.. ఆ సమస్యను ఎదుర్కునే శక్తిని ప్రసాదించడం వేడుకోవడం మంచిది.. శుభోదయం.
- ఒకరు చెప్పింది కాదనడం కంటే పట్టించుకోకపోవడం లేదా నిర్లక్ష్యం చేయడమే మరింత ఎక్కువ అవమానకరం.. శుభోదయం.
- సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలో కూడా విజయం సాధించలేరు. గుడ్ మార్నింగ్.
- నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో నేనే అన్న అహంకారం మనిషిని అంతగా దిగజార్చుతుంది. శుభోదయం.
- వెయ్యి వ్యర్థమైన మాటలు వినడం కన్నా.. ప్రశాంతతను ప్రసాదించే ఒకే ఒక్క మంచి మాట వినడం ఉత్తమం. గుడ్ మార్నింగ్.
- అవకాశాల కోసం ఎదురుచూడడం కాదు..మీరే స్వయంగా అవకాశాలను సృష్టించుకోవాలి.. శుభోదయం..!
Also Read –Best Motivational and Inspirational Quotes in Telugu, తెలుగు కొటేషన్స్