Home » telangana కాంగ్రెస్ లో ముదిరిన వివాదం..MLA సీతక్క రాజీనామా వెనుక అసలు నిజం..!!

telangana కాంగ్రెస్ లో ముదిరిన వివాదం..MLA సీతక్క రాజీనామా వెనుక అసలు నిజం..!!

by Sravanthi
Ad

కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద పార్టీ. భారతదేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కూడా కాంగ్రెస్సే. అలాంటి ఘన చరిత్ర కలిగిన పార్టీ గల్లి నుంచి ఢిల్లీ వరకు నీరుగారి పోతోంది. ఢిల్లీ పెద్దలు ఎన్ని ఎత్తులు వేసినా పార్టీ నేతల్లో సఖ్యత మాత్రం కుదరడం లేదు. ఈ సమస్య కేవలం తెలంగాణలోనే కాదు. టోటల్ దేశము మొత్తంలో కాంగ్రెస్ కు ఇలాంటి సమస్య ఎదురవుతోంది. ఎంతో క్యాడర్ ఉన్న ఈ పార్టీ నాయకుల మధ్య సఖ్యత కుదరక పూర్తిగా డీల అవుతోంది. కట్ చేస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది.

Advertisement

also read;మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!!

Advertisement

ఇప్పటికైనా పుంజుకుంటుంది అనే టైంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో తలనొప్పి ఎదురవుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు ఇప్పటికే బీజేపీలోచేరారు, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంత పార్టీ పైన వ్యతిరేక బాణాలు వేస్తున్నారు. ఈ తరుణంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో మరో వివాదం చెలరేగింది. అదేంటయ్యా అంటే సీతక్క తో సహా 13 మంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కమిటీ పదవులకు రాజీనామా చేశారు. ఈ తరుణంలో సీతక్క మాట్లాడుతూ.. పార్టీకి ఎలాంటి ఇబ్బందులు రావద్దని రాజీనామా చేశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

కనీసం ఉప ఎన్నికల్లో ప్రచారం కూడా చేయని నేతలు ఇలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. రాజీనామా చేసిన కాంగ్రెస్ బలోపేతానికి పని చేస్తానని తెలియజేశారు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని ఆమె అన్నారు. ఈ విధంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి నేతలు అంతా రాజీనామాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రాజీనామాల పర్వం ఇలాగే ఉంటుందో ఒకవేళ పార్టీ మారే వరకు వస్తుందో తెలియాల్సి ఉంది.

also read;

Visitors Are Also Reading