Home » happy birthday venkatesh: వెంకటేష్ ఆ హీరోయిన్ తో అస్సలు మాట్లాడడు.. కారణం ఏంటో తెలుసా..?

happy birthday venkatesh: వెంకటేష్ ఆ హీరోయిన్ తో అస్సలు మాట్లాడడు.. కారణం ఏంటో తెలుసా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా కొనసాగుతున్న హీరో వెంకటేష్.. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా ఈయనకు మంచి పేరు ఉంది.. అలాంటి వెంకటేష్ ఆ స్టార్ హీరోయిన్ తో అసలు మాట్లాడడట.. మరి వారి మధ్య అంత వైరం ఏముంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో జత కట్టిన వెంకటేష్ ఒక్క హీరోయిన్ కు మాత్రం దూరంగా ఉంటూ వచ్చాడు.. ప్రస్తుతం ఆ హీరోయిన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది.. అప్పట్లో వెంకటేష్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొని షాక్ ఇచ్చింది..

Advertisement

also read:హీరోయిన్ కోట్లు లుగా సంపాదించి… ప్రొడ్యూసర్ లుగా మారి చేతులు కాల్చుకున్న‌ అందాల తార‌లు వీళ్లే..!

Advertisement

అయితే ఆ హీరోయిన్  మరియు వెంకటేష్ కాంబినేషన్లో ఒక సినిమా సెట్ అయింది.. ఒక స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఈమెతో వెంకటేష్ కలిసి సినిమా చేద్దామనుకున్నారట.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు.. మళ్లీ అదే కథాంశంతో కొన్నేళ్ల తర్వాత  మరో స్టార్ హీరోయిన్ ను పెట్టి సినిమా తీశారు. ఆమె కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతోంది. స్టోరీ అంతా సేమ్ టు సేమ్ తనకు వినిపించిన స్టోరీ లాగే ఉందని, నన్ను కాదని మరో హీరోయిన్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని వెంకటేష్ పై కోపానికి వచ్చిందట.

దీంతో వెంకటేష్ కూడా కోపానికి వచ్చి అదంతా దర్శక నిర్మాతల నిర్ణయం అని నా ప్రమేయం ఏమీ లేదని చెప్పారట.. ఇక అప్పటి నుంచి వీరి మధ్య వార్ నడుస్తూనే ఉంది.. ఆ రోజు నుంచి ఈరోజు వరకు వీరి మధ్య మాటలు లేవని సమాచారం. ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అయినా వారిని కలిపే ప్రయత్నం చేయలేదు.. దీనికి ప్రధాన కారణం ఆ హీరోయిన్ ఎంత మొండిదో  అందరికీ తెలుసు.. మరి వీరి మధ్య మాటలు ఎప్పుడు కుదురుతాయో ఎప్పుడు మాట్లాడుకుంటారో ముందు ముందు తెలుస్తుంది.

also read:

Visitors Are Also Reading