Home » విచిత్ర‌సోద‌రుడు సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ మ‌ర‌గుజ్జు పాత్ర వెన‌క ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?

విచిత్ర‌సోద‌రుడు సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ మ‌ర‌గుజ్జు పాత్ర వెన‌క ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా..?

by AJAY
Ad

ఇండియాలోని గొప్ప న‌టుల‌లో క‌మ‌ల్ హాస‌న్ కూడా ఒక‌రు. న‌ట‌న‌లో క‌మల్ లెజెండ్ అనే చెప్పాలి. భార‌తీయుడు సినిమాలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో క‌మ‌ల్ మెప్పించారు. అంతే కాకుండా స్వాతిముత్యం సినిమాలో అమాయ‌కంగా క‌నిపిస్తూ అద‌ర‌గొట్టాడు. అదేవిధంగా ద‌శావతారం సినిమాలో ప‌ది పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించారు. ఈ సినిమాలే కాకుండా క‌మ‌ల్ హాస‌న్ న‌ట విశ్వ‌రూపం చూపించిన సినిమాల‌లో విచిత్ర సోద‌రుడు సినిమా కూడా ఒక‌టి. అప్ప‌ట్లో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Also Read: 2022లో గూగుల్ లో అత్య‌ధికంగా వెతికిన 10 ఇండియ‌న్ సినిమాలు..నంబ‌ర్ 1 స్థానంలో ఏ సినిమా ఉందంటే..?

Advertisement

సినిమాలో క‌మ‌ల్ న‌ట‌నకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సింగీతం శ్రీనివాస‌రావు గ్రాఫిక్స్ లేని స‌మ‌యంలోనూ త‌న టాలెంట్ తో అద్భుతాల‌ను క్రియేట్ చేశారు. అయితే విచిత్ర సోద‌రుడు సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ ను ద‌ర్శ‌కుడు మ‌ర‌గుజ్జులా ఎలా చూపించాడు. అనే అనుమానం చాలా మందికి వ‌చ్చింది. కాగా ఆ పాత్ర వెన‌క ఓ సీక్రెట్ కూడా ఉంది.

Advertisement

Vichitra sodarulu: పొట్టికమల్‌ ఇలా పుట్టాడు

 

సినిమాలో క‌మ‌ల్ పొట్టిగా కనిపించ‌డానికి కేవ‌లం ఆయ‌న న‌డుం ప‌ర‌కే క‌నిపించేటట్టు ఎక్కువ క్లోజ‌ప్ షాట్ ల‌ను తీశామ‌ని సింగీతం శ్రీనివాసరావు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అంతే కాకుండా మోకాళ్ల ద‌గ్గ‌ర క‌మల్ హాస‌న్ కాళ్లు వెన‌క్కి వ‌చ్చేలా ప‌ద్దెనిమిది అంగుళాల వెడ‌ల్పు ప‌ట్టీలు వ‌చ్చే విదంగా షూ ను త‌యారు చేపించార‌ట‌.

Kamal Haasan

అంతే కాకుండా నేల పై కూర్చునేట‌ప్పుడు క‌మ‌ల్ హాస‌న్ కాళ్ల‌ను భూమిలో పాతి పెట్టేవార‌ట‌. ఓ సీన్ లో సోపాలో కూర్చుని కాళ్ల‌ను ఊపే సీన్ ఉంటుంది. ఆ సోపాను ప్ర‌త్యేకంగా చేయించారు. సోపాకు రంధ్రాలు చేయించి..కాళ్లు ఊపుతున్న‌ట్టు క‌నిపించేందుకు ర‌బ్బ‌ర్ కాళ్ల‌ను అమ‌ర్చి వాటిని తీగ‌ల‌తో క‌ట్టి ఊపార‌ట‌. ఇలా క‌మ‌ల్ హాస‌న్ విచిత్ర సోద‌రుడు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని సింగీతం శ్రీనివాస‌రావు వెల్ల‌డించారు.

Also Read:  హీరోయిన్ కోట్లు లుగా సంపాదించి… ప్రొడ్యూసర్ లుగా మారి చేతులు కాల్చుకున్న‌ అందాల తార‌లు వీళ్లే..!

Visitors Are Also Reading