సాధారణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా జనాలు వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి దిశగా పయణిస్తున్నారు. ఎప్పుడూ ఒకే ధోరణిలో కాకుండా సరికొత్తగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సరదాగా సరికొత్తగా కాలక్షేపం చేసేందుకు ఎక్కువగా ఈరోజుల్లో ఆసక్తి చూపిస్తున్నారు. అలా చేయడానికి 10 అడ్వెంచర్ యాక్టివిటిస్ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read : Shikhar Dhawan : ఇషాన్ కిషన్ ఎఫెక్ట్.. శిఖర్ ధావన్ కు రిటైర్ మెంట్ !!
స్కై డైవింగ్
అడ్వెంచర్ యాక్టివిటిస్ అంటే పెద్ద సాహసమే చేయాలి. ఎలాంటి సాహసాలు చేయాలంటే..? సాధారణంగా ఎత్తుగా ఉండే ప్రదేశాలు అంటే భయపడే వారు చాలా మంది ఉంటారు. వందల మీటర్ల ఎత్తు నుంచి గాలిలోకి అమాంతం దూకేసే స్కై డైవింగ్ చేయడమంటే మామూలు విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పర్యటక ప్రదేశాలలో స్కై డైవింగ్ కి విశేష ఆదరణ లభిస్తోంది. భారతదేశంలో కూడా క్రమ క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో యువత ఇప్పటికే స్కై డైవింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆంబే వ్యాలీ- మహారాష్ట్ర, మైసూరు, కర్ణాటక, ధనా మధ్యప్రదేశ్, దీసా, మెహ్ సానా గుజరాత్, పాండేచ్చేరి- తమిళనాడు దేశంలో ప్రధాన స్కై డైవింగ్ కేంద్రాలు. స్కై డైవింగ్ దుబాయ్ లో చాలా ఫేమస్. దీనికి దాదాపు రూ.45,000 వరకు ఫీజు ఉంటుంది.
స్కూబా డైవింగ్
వాటర్ స్పోర్ట్స్ లో స్కూబా డైవింగ్ ని రారాజు అని పిలుస్తారు. అత్యంత వినోదభరితమైన క్రీడనే కాకుండా ఉత్కంఠకు గురి చేసే జలక్రీడ. అందుకే స్కూబా డైవింగ్ కి రారాజు అని పేరు. సమద్రం లోపల జలచరాలతో జలకాలాడుతూ అక్కడి అందాలను చూడడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగుల్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. థాయ్ లాండ్ లో చాాలా ఫేమస్. దీనికి రూ.4,000 నుంచి రూ.4,500 వరకు ఉంటుది. ఇక భారత్ లో లక్షదీవులలో ఎక్కువగా స్కూబా డైవింగ్ చేస్తుంటారు.
పారా సైలింగ్
సాధారణంగా పక్షి మాదిరిగా గాలిలో ఎత్తుగా ఎగురుతూ.. ప్రపంచ మీదుగా గాలిని చీల్చుకుంటూ సాహసం చేస్తే ఆ థ్రిల్ వేరు. పారా సైలింగ్ చేయడం ద్వారా శరీరానికి ఉల్లాసం కలుగుతుంది. పారా సైలింగ్ ఆకాశంలో ఎగురవేయడం.. మోటార్ బోట్ లేదా కారు వంటి కదిలే వాహనం ద్వారా లాగుటారు. పారాసైలింగ్ మూడు రకాలుగా ఉంటాయి. వించ్ బోట్, బీచ్, ఫ్లాట్ ఫాం ఉంటాయి. ప్రధానంగా గోవాలో పారా సైలింగ్ ఎక్కువగా చేస్తుంటారు. దీనికి రూ.900 నుంచి రూ.1200 ధర పలుకుతుంది.
పారాగ్లైడింగ్
Advertisement
మనాలిలో అత్యంత సాహసోపేతమైన క్రీడలలో ఒకటిగా పారా గ్లైడింగ్ క్రీడను పరిగణించవచ్చు. దీనిని ఎక్కువగా లక్ష్యదీప్, మనాలి ప్రాంతాలలో పారాగ్లైడింగ్ చేస్తుంటారు. ఏరో స్పోర్ట్స్ ఆనందించే వారు టాక్సీ లేదా ట్రెక్కింగ్ ద్వారా మనాలి నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉన్నటువంటి లోయ సోలాంగ్ వాలి వద్దరు చేరుకోవచ్చు. మే నుంచి సెప్టెంబర్ వరకు పారాగ్లైడింగ్ చేపట్టేందుకు అనువైన సమయం. దీనికోసం రూ.2000 నుంచి రూ.3000 వరకు ఉంటుంది. స్విట్జర్లాండ్ లో ఎక్కువగా పారాగ్లైడింగ్ చేస్తుంటారు.
సీ వాక్
సాధారణంగా సీ వాక్ ని చాలా మంది చేస్తుంటారు. ప్రధానంగా అండమాన్ నికోబార్ దీవులలో నీటి అడుగున వాక్ చేస్తుంటారు. ఈతగాళ్లు కానీ వారు కూడా హెల్మెట్ ఉపయోగించి సీ వాక్ చేయవచ్చు. సీవాక్ కి దాదాపు రూ.2000 నుంచి రూ.2,500 వరకు ఖర్చు అవుతుంది.
రివర్ రాప్టింగ్
ముఖ్యంగా చుట్టూ ప్రవహించే నీళ్లతో.. నీటిని ముంచెత్తే నీటి స్ప్లాష్ లు మీ మనస్సు, శరీరాన్ని చూపిస్తూ హద్దులులేని నీటిపై రాపిడ్ ల గుండా స్వారి చేయడం వంటివి కనిపిస్తాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్ లలో ఒకటిగా ఉద్భవించిన రివర్ రాప్టింగ్ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తుంటారు. భారతదేశంలో నదులు ఎక్కువగా అందుబాటులో ఉండడంతో రివర్ రాప్టింగ్ కి హాట్ స్పాట్ గా మారుతోంది. ప్రధానంగా మనాలి రిషికేష్ ప్రాంతాల్లో రివర్ క్రాప్టింగ్ ఎక్కువగా చేస్తుంటారు దీని కోసం రూ.600 నుంచి రూ.1000 వరకు ఖర్చు అవుతుంది.
బంగీ జంపింగ్
అందమైన కొండ ప్రాంతాల్లో ఎక్కువగా బంగీ జంపింగ్ నిర్వహిస్తుంటారు. భారతదేశంలో రిషికేష్, గోవా వంటి ప్రాంతాలలో ఎక్కువగా బంగీ జంపింగ్ చేస్తుంటారు. రిషికేష్ కొండ ప్రాంతం కావడంతో 15 నుంచి 20 నిమిషాల వరకు నడక తరువాత బంగి జంపింగ్ చేస్తుంటారు. ఇది శ్రమతో కూడుకున్నది. ఇది చేయాలంటే స్పోర్ట్స్ షూలతోనే సాధ్యమవుతుంది.
హాట్ ఎయిర్ బెలూన్
శక్తివంతమైన రంగుల జెయింట్ హాట్ ఎయిర్ బెలూన్ లో ఆకాశంలో ఎగురుతూ ఎయిర్ బెలూన్ లో ప్రయాణించడం చాలా మంది ఇష్టపడుతుంటారు. బహిరంగ ప్రదేశంలో ఎత్తైన ప్రదేశం నుంచి ఈ అద్భుతమైన దృశ్యాలను వీక్షించడం గొప్ప అనుభూతి అనే చెప్పాలి. భారత్ లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ లు కొత్త భావనను కలిగిస్తాయి. టర్కీలో వీటిలో ఎక్కువగా ప్రయాణిస్తారు. రూ.6000 నుంచి రూ.6500 వరకు ఉంటుంది.
Also Read : Vishnu priya: అవకాశాల కోసం అలాంటి పని చేసిన తప్పులేదు.. యాంకర్ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్..!!
స్కీయింగ్
డౌన్ హిల్ స్కీయింగ్ అనేది ఓ క్రీడ. పర్వతం లేదా కొండ వైపున కాలిబాటలో స్కీయింగ్ చేస్తుంటారు. స్కీయింగ్ రేట్ చేయడానికి మూడు వేర్వేరు రంగులు వినియోగిస్తారు. ఆకుపచ్చ, నీలం, నలుపు ట్రయల్స్ చేస్తారు. వీటిలో ఆకుపచ్చ ట్రయల్స్ చాలా సులభం. కానీ నీలం, నలుపు ట్రయల్స్ చాలా కష్టమనే చెప్పాలి.