Home » Shikhar Dhawan : ఇషాన్ కిషన్ ఎఫెక్ట్.. శిఖర్ ధావన్ కు రిటైర్ మెంట్ !!

Shikhar Dhawan : ఇషాన్ కిషన్ ఎఫెక్ట్.. శిఖర్ ధావన్ కు రిటైర్ మెంట్ !!

by Bunty
Ad

టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వీరవిహారం చేసాడు. బంగ్లా బౌలింగ్ ను తుక్కు తుక్కు చేస్తూ ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్ లతో 200 రన్స్ చేశారు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తో, టీమిండియా వెటరన్ ఓపెనర్ షికర్ ధావన్ పరిస్థితి దారుణంగా తయారు అయింది.


అసలే సీనియర్ ప్లేయర్ అనే కారణంతో టి20, టెస్ట్ ఫార్మాట్లకు శిఖర్ ధావన్ ను బీసీసీఐ దూరం పెట్టగా, వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఇషాన్ కిషన్ రూపంలో ఉన్న ఈ ఒక్క అవకాశం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్, విధ్వంసకర డబుల్ సెంచరీ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. అసాధారణ బ్యాటింగ్ తో యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకున్న ఇషాన్ కిషన్ విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. సెలెక్టర్లు తనను విస్మరించకుండా చేశాడు.

Advertisement

Advertisement

వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ ప్రణాళికలో శిఖర్ ధావన్ ను కొనసాగించాలా? పక్కన పెట్టాలా? అనే సందిగ్ధతను ఇషాన్ కిషన్ తీసుకొచ్చాడు. దావన్ కంటే తాను ఎంతో బెటర్ అనే విషయాన్ని చాటి చెప్పాడు. ఈ యువ ఓపెనర్ కారణంగా 36 ఏళ్ల గబ్బర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. గరిష్టంగా మరో ఆరు మ్యాచ్ లతో అతని భవితవ్యం తేలనుంది. చివరి 9 వన్డేల్లో దావన్ 8 మ్యాచ్ ల్లో ఇబ్బంది పడ్డాడు. పాతకాలపు అప్రోచ్ తో ఆడుతూ జట్టుకు తీరని నష్టం చేస్తున్నాడు. పవర్ ప్లే లో వేగంగా ఆడలేక ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్ ఇన్నోవెటివ్ షాట్స్ తో అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్వహించే రివ్యూ మీటింగ్ లో శిఖర్ ధావన్ భవితవ్యంపై తుది నిర్ణయం తీసుకొనున్నారు. ఇక అటు శిఖర్ ధావన్ కు రిటైర్ మెంట్ తప్పదని కొంత మంది అంటున్నారు.

READ ALSO : బాలయ్య తన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ చేయలేదో తెలుసా..?

Visitors Are Also Reading