Home » పార్టీ మార్పుపై సంచలన కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి..!!

పార్టీ మార్పుపై సంచలన కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి..!!

by Sravanthi Pandrala Pandrala

గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి బిజెపిలో చేరారు.. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పార్టీలోనే కొనసాగుతూ సొంత పార్టీ పైన ముప్పేట దాడి చేస్తున్నాడు. ఈ తరుణంలో ఆయనను కాంగ్రెస్ అధిష్టానం అనేక లేఖలు కూడా పంపింది.. ఈ క్రమంలో ఆయన పార్టీ మార్పుపై కీలకమైన కామెంట్లు చేశారు.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏడాదిన్నర కాలం పాటు నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెట్టాలనుకుంటున్నాను.

also read:Vasthu tips: ఈ ఏడాది ముగిసేలోపు ఈ 4 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి.. అన్ని సమస్యలు పరార్..!!

భువనగిరి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని నేనే అంటూ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలాన్ని సృష్టించాయి. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై స్పందించారు.. వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై ప్రభుత్వం తీరు చాలా బాధాకరమని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా టిఆర్ఎస్ పార్టీ దారుణంగా వ్యవహరిస్తుందని షర్మిలకు మద్దతుగా మాట్లాడారు. ఈ ఘటనను ఖండించాలని అన్నారు. రాష్ట్రంలో నియంతన పాలన కొనసాగుతోందని ఎద్దేవ చేశారు. అలాగే ఎమ్మెల్సీ కవితపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా, రాహుల్ లాంటి కీలకమైన నేతలని పిలిచి విచారణ జరిపారని, కానీ తెలంగాణ సీఎం కుమార్తె కవితకు ఎందుకు ఈ మినహాయింపు అని అడిగారు కోమటిరెడ్డి.

అలాగే ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసుకున్నారు. ఎన్నికలకు ముందే తన పార్టీ మార్పు విషయం బయట పెడతా అన్నారు.. అంటే పార్టీ మారతానా లేదా అనే విషయాన్ని ఎన్నికలకు నెల ముందు తెలియజేస్తానని చెప్పారు. అలాగే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల్లో తమ్ముడికి సపోర్ట్ చేసి మాట్లాడారు.. ఈ తరుణంలో ఒకవేళ పార్టీ మారితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

also read:

Visitors Are Also Reading