Home » Panchatantram Movie Review : ‘పంచతంత్రం’ రివ్యూ

Panchatantram Movie Review : ‘పంచతంత్రం’ రివ్యూ

by Bunty
Ad

Panchathantram Review in Telugu: బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక, రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ఐదు కథలతో హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Panchathantram Review in Telugu

Panchathantram Review in Telugu

Panchathantram Review in Telugu కథ మరియు వివరణ:

ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వేదవ్యాస్ (బ్రహ్మానందం) 60 ఏళ్ల వయస్సులో రచయితగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటాడు. తన కూతురు రోషిని (స్వాతి రెడ్డి) ఈ వయసులో ఇవన్నీ ఎందుకు, మంచిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినకుండా వేదవ్యాస్ ఒక కథల పోటీకి వెళ్తాడు. ఒకే థీమ్ తో ఒకదానికొకటి సంబంధం లేని విభిన్న కథలు చెప్పాలనేది అక్కడ షరతు. అప్పుడు ‘పంచేంద్రియాలు’ అనే థీమ్ తో ఐదు కథలు చెప్తాడు వేదవ్యాస్. అసలు ఆ ఐదు కథలు ఏంటి? ఆ కథల ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు. ఆ కథలు విన్నాక రోషిని ఆలోచన విధానంలో వచ్చిన మార్పు ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Advertisement

Advertisement

ఓ పోయోటిక్ సెన్స్ లో తీసిన చిత్రమిది. కమర్షియల్ అంశాలు అతీతంగా ఒక ఫీల్ ని, పంచెంద్రియాలను థీమ్ గా తీసుకుని కథ అల్లుకున్నాడు దర్శకుడు హర్ష పులిపాక. మన చుట్టూ నిత్యం జరిగే విషయాలను, సంఘటనలనే కథా వస్తువులుగా ఎంచుకొని తెరకెక్కించిన తీరు బాగుంది. మొదటగా ఇలాంటి ఐడియాతో సినిమా తీయాలని దర్శకుడి ఆలోచనకు శభాష్ కొట్టాల్సిందే. ఐదు కథలను అల్లుకున్న తీరు, వాటికి పంచేంద్రియాల కాన్సెప్ట్ ముడిపెట్టిన తీరు బాగుంది. అయితే కథల పరంగా చూస్తే అన్ని కథల ఆడియన్స్ ని అంతటి ఫీల్ కి గురి చేయలేకపోయాయి. మొదటి కథతో ఫీల్ మిస్ అయింది. దీంతో ఆ స్టోరీతో ఆడియన్స్ ట్రావెల్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. ప్రారంభమే కాబట్టి ఆడియన్స్ దానికి కనెక్ట్ కాలేకపోతారు. ఇక రెండో కథ రాహుల్ విజయ్, శివాత్మిక స్టోరీ నుంచి కథలో ఫీల్ స్టార్ట్ అవుతుంది. అది ఆడియన్స్ సైతం ఫీలయ్యేలా చేస్తుంది. మూడో కథ అయిన సముద్రఖని ఎపిసోడ్ కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. ఆయనకు వచ్చే స్మెల్ కి, తన కూతురు డెలివరీకి, తన గతానికి ముడిపెట్టిన తీరు బాగున్నప్పటికీ అంతటి ఫీల్ ని తీసుకు రాలేకపోయింది. నాలుగు, ఐదు కథలు బాగా ఆకట్టుకోలేకపోయాయి.

ప్లస్ పాయింట్స్:

బ్రహ్మానందం పాత్ర
కామెడీ సీన్లు
సీరియస్ రోల్స్
నటీనటులే సినిమాకి పెద్ద బలం

మైనస్ పాయింట్స్:
మ్యూజిక్
సీన్ల సాగదీత
దర్శకత్వంలో లోపాలు

రేటింగ్:2.5/5

read Also : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న

Visitors Are Also Reading