సోషల్ మీడియా ద్వారా మంచి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో… చెడు కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల తప్పుడు వార్తల ప్రభావం ఎక్కువైపోయింది. నటీనటులు బ్రతికుండగానే చనిపోయినట్టు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా హీరో హీరోయిన్ల మధ్య సంబంధాలు అంటగట్టడం… వారి పర్సనల్ జీవితాల గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం యూట్యూబ్ లో జరుగుతూనే ఉంది. కాగా తాజాగా తాను కూడా అలాంటి వార్తల వల్ల ఇబ్బంది పడ్డానని ప్రముఖ నటుడు చంద్రమోహన్ వెల్లడించారు.
Advertisement
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చంద్రమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల కిందట చంద్రమోహన్ కు తీవ్ర అనారోగ్యం అంటూ కథనాలు రాశారు. ఈ విషయంపై చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని స్టంట్ వేశారని చెప్పారు. ఇప్పుడు అంతా బాగుందని అన్నారు. కానీ యూట్యూబ్ లో తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయని అన్నారు. తనకు చాలా సీరియస్ గా ఉంది అంటూ వార్తలు రావడంతో విదేశాల్లో ఉండే తన కూతురు అల్లుడు భయపడి ఇంటికి వచ్చారని చెప్పారు.
Advertisement
డాక్టర్లు కోలుకుంటున్నట్టు తన కూతురు అల్లుడికి చెప్పారని అన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం అవడం వల్లనే తాను ఇంటికి వెళ్లిన తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సివచ్చిందని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తాను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. కిడ్నీ సమస్య రావడం వల్ల డయాలసిస్ చేయాలని చెప్పినట్టు తెలిపారు. మొదట్లో నచ్చక వద్దన్నానని కానీ చేయించుకోవాలి లేదంటే కిడ్నీ మార్చాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారని అన్నారు.
మీ వయసు దానికి తట్టుకోదని చెప్పడంతో చేయించుకుంటున్నట్టు తెలిపారు. డయాలసిస్ కు ఒకసారి రెండువేల దాకా ఖర్చు అయ్యేదని…. అలా నెలకు 60000 ఖర్చు అయ్యేదని చెప్పారు. కొంచెం ఇబ్బంది పడినా మెల్లగా ఇంట్లో వాళ్ళే దానికి ట్రైన్ అయ్యారని చెప్పారు. ఇంట్లోనే మిషన్ కూడా పెట్టి చేస్తున్నారని అన్నారు. ఎప్పుడైనా బయట నుండి పిలిపించి చేయిస్తున్నారని చెప్పారు. సరైన ఆహారం తిని డైట్ ఫాలో అవుతూ ప్రశాంతంగా ఉంటే సమస్య రాదని చంద్రమోహన్ వెల్లడించారు.