భారత ప్రభుత్వం రైతుల కోసం సరికొత్త పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఇటీవలే పీఎం కిసాన్ 12వ విడుత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ పథకానికి సంబంధించి 13వ విడుత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఒక శుభవార్త అనే చెప్పాలి. వారి నిరీక్షణ అతి త్వరలోనే ఫలించనుంది. నూతన సంవత్సరంలో ఆ డబ్బులను విడుదల చేయనున్నారు. 2023 ప్రారంభంలోనే నూతన సంవత్సర కానుకగా 13వ విడుత వాయిదా డబ్బులను రైతులకు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Advertisement
జనవరి 01, 2023న రైతుల ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీఎం కిసాన్ యోజన సొమ్ము కోసం రైతులు ఈ కేవైసీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఎవరైనా కేవైసీ చేయని వారు ఉంటే ఇక ఇప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు ఇవ్వవచ్చు. లేదంటే వారికి 13వ విడుత డబ్బులు రావు.
ఈ-కేవైసీ ఎలా చేయాలి
Advertisement
- ఫస్ట్ అధికారిక వెబ్ సైట్ కి వెళ్లాలి.
- ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అక్కడ ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.
- ఇమేజ్ కోడ్ ని నమోదు చేసి, సెర్ట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి, ఓటీపీని టైప్ చేయాలి.
- మీరు ఇచ్చిన అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయినట్టే.
- ఒకవేళ సరిగ్గా లేకపోతే మాత్రం ఈ కేవైసీ పూర్తవ్వదు.
మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద ఏమైనా సమస్యను ఎదుర్కొంటున్నట్టయితే దానిని త్వరగా పరిష్కారం పొందవచ్చు. ఇందుకోసం మీరు హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మెయిల్ ఐడీలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ 155261లేదా 1800115526ని సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును ఇ-మెయిల్ ఐడీ pmkisan-ict@gov.in లో కూడా మెయిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు దరఖాస్తు చేసుకోకుంటే pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి నమోదు చేసుకోండి. అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులు ఈ కేవైసీ చేసుకోవడం తప్పనిసరి.