గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అవంతరాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఆమెపై గొడవలు దిగుతూ విరుచుకు పడుతున్నారు టిఆర్ఎస్ నాయకులు. ఈ తరుణంలోనే దీటుగా సమాధానం చెబుతూ ముందుకు పోతోంది వైయస్ షర్మిల. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వైయస్ షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిలా పూర్తిగా బిజెపి వదిలిన బాణం అంటూ మండిపడ్డారు.
Advertisement
also read:మంచు విష్ణు జిన్నా ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే ?
ఆమె బిజెపితో అన్ని విధాల హామీలు తీసుకొని, అమిత్ షా తో మాట్లాడి ఇక్కడ పాదయాత్ర మొదలు పెట్టిందని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రజల సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడావా, కేంద్రం ఇప్పటికి కూడా తెలంగాణకు నిధులను విడుదల చేయకపోవడం వెనక అసలు కారణం ఏంటని అడిగావా.. ప్రశ్నించారు..
Advertisement
దళితుల హక్కులపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఈ విధంగా పాదయాత్ర చేస్తూ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వంపై బురద పూచే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కెసిఆర్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, 24 గంటల కరెంటు అందుతుందని ఇంత జరిగినా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడడం సబబు కాదని నువ్వు తెలంగాణలో ఎంత తిరిగిన మా బిడ్డ అని అస్సలు అనుకోరు అంటూ ఎద్దేవ చేశారు. నీ రాజకీయం కోసం సరైన ప్రజా క్షేత్రాన్ని ఎంచుకో.. ఆంధ్రప్రదేశ్ వెళ్లి నీ పాదయాత్ర చేసుకో.. ఇప్పటికి జగన్ షర్మిల ఒక్కటా.. లేదంటే వేరా.. అనే పరిస్థితి నెలకొందని వినోద్ కుమార్ విమర్శించారు.
also read: