Home » మంచు విష్ణు జిన్నా ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే ?

మంచు విష్ణు జిన్నా ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే ?

by Anji
Ad

టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల మోసగాళ్లు సినిమా తీశాడు. తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జిన్నా గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నిలియోన్ హీరోయిన్లుగా నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్ కి కాస్త కామెడీని జోడించి వినోదాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది జిన్నా సినిమా. ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన మేరకు కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

Advertisement

ఈ సినిమాలోని కామెడీ సీన్లు, విష్ణు, పాయల్, సన్నిలియోన్ నటన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. జిన్నా సినిమా డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధం అయ్యింది. థియేటర్లలో మోస్తారుగా ఆకట్టుకున్న జిన్నా హిట్ కొట్టేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. జిన్నా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.  డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Also Read :  చిరంజీవి దగ్గర సౌందర్య నాపై ఏమని కంప్లైంట్ చేసిందంటే ?

Manam News

సినిమాకు ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి కథను అందించగా.. కొన వెంకట్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఎంటర్టైన్మెంట్ యూనివర్సల్ స్టూడియో లతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పై ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, రఘుబాబు, సీనియర్ నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సినిమాతో తన కుమార్తెలు అరియానా, వినియానను సింగర్స్ గా పరిచయం చేశారు మంచు విష్ణు. జిన్నా చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. థియేటర్లలో ఆకట్టుకోలేని జిన్నా చిత్రం ఓటీటీలో ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి మరి.

Also Read :  REPEAT MOVIE REVIEW OTT in Telugu : రిపీట్ మూవీ రివ్యూ.. వారికే నచ్చుతుంది..!

Visitors Are Also Reading