పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరో అని చాలామంది చెబుతుంటారు. సాయం కోసం వచ్చిన వారికి కచ్చితంగా పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని సినీవర్గాల్లో కూడా చర్చించుకుంటూ ఉంటారు. తాజాగా వకీల్ సాబ్ నటుడు సమ్మెట గాంధీ సైతం పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సమ్మెట గాంధీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఆయన వద్ద పనిచేసే వ్యక్తిగా కనిపించిన సంగతి తెలిసిందే.
Advertisement
ఇక తాజా ఇంటర్వ్యూలో సమ్మెట గాంధీ మాట్లాడుతూ…. విలన్ పాత్రలో నటించాలని నాకు కోరిక ఎవరైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా నటిస్తానని చెప్పారు. అంతేకాకుండా వకీల్ సాబ్… అఖండ సినిమాలతో తాను ఫేమస్ అయ్యానని అన్నారు. రవితేజ షూటింగ్ కి వచ్చినప్పుడు ఉదయం ఎలాంటి ఎనర్జీతో ఉంటాడో సాయంత్రం కూడా అదే ఎనర్జీతో ఉంటారని చెప్పాడు. ది వారియర్ సినిమాలో ఓ సీన్ కోసం డూప్ ను పెడదాం అని చెప్పినా… తను వద్దని చెప్పానని అన్నారు.
Advertisement
అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్ తన అభిమాన హీరో అని చెప్పారు. మహేష్ బాబుతో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించానని చెప్పారు. చిరంజీవితో చాలా సినిమాలు చేశానని అన్నారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ గురించి చెబుతూ….ఓ జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయి పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ ను కలిశానని అన్నారు. దాంతో ఆయన వెంటనే లక్ష రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు.
అంతేకాకుండా పావలా శ్యామల హార్ట్ ఆపరేషన్ కు కూడా పవన్ కళ్యాణ్ సాయం చేశారని చెప్పారు. పవన్ కళ్యాణ్ చాలా గొప్పవారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు పేదల పట్ల గౌరవం ఉందని వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా సొంత డబ్బు ఖర్చు చేస్తూ ప్రజలకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.