ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతులకు గొప్ప శుభవార్త అందించారు. ఒకేరోజు రెండు రకాల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో పడనుంది. 200 కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లోకి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు సీఎం జగన్.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకాన్ని రైతులకు అందిస్తున్నామని ఏపీ సర్కార్ చెబుతోంది. వైఎస్ సున్న వడ్డీతో రైతుల రుణాలు అందిస్తున్నామని, లక్ష రూపాయలు లోపల లోన్స్ ఎవరైతే క్లియర్ గా చెల్లిస్తారో 160.65 లక్షల నగదు జమ చేయనుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.. ఇందులో 8.22 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది. అంతేకాకుండా వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతన్నలకు మరియు భారీ వరదల వాళ్ల నష్టపోయిన వారికి ఈ సబ్సిడీ జమ చేయనున్నారు..
Advertisement
also read:ఈ 3 లక్షణాలున్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోరాదు.. కారణం ఇదే..!!
Advertisement
గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఈ ప్రభుత్వం ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లో నష్టపరిహారం ఇస్తున్నది. ప్రస్తుతం 45,998 మందికి లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది. ఖరీఫ్ పంట సీజన్ కి ముందే జగన్ ఈ ఆఫర్ ను అందిస్తున్నారని, ఒకేరోజు పంట నష్టపరిహారాన్ని మరియు బకాయి ఉన్న సున్నా వడ్డీ మొత్తాన్ని రైతన్నల అకౌంట్లోకి జమ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఈ విధంగా రైతన్నలకు అండగా నిలబడతామని చెప్పకనే చెబుతోంది. అదేవిధంగా గోదావరి వరదలు ఇతర వైపరీత్యాల కారణంగా పాడైన పంటలకు నష్టపరిహారం అందించేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ ముగియక ముందే ఈ పరిహారం అందించబోతోంది. ఈ డబ్బు కూడా నష్టపోయినటువంటి రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనుంది.
ఈ నష్ట పరిహారానికి అర్హులైన రైతుల జాబితా ఆర్ బికే లలో ప్రదర్శనలో ఉంచారు. 2022-23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 45,998 మంది రైతన్నలకు 39.39 కోట్ల నగదును విడుదల చేయనుంది ఏపీ సర్కార్. అంతేకాకుండా 2014 నుండి 2019 మధ్య గత ప్రభుత్వం ఎగొట్టిన 38.42 లక్షల మంది అన్నదాతలకు 688.25 కోట్ల రూపాయలు జమ చేయడమే కాకుండా ఖరీఫ్ 2019 లో 14.28 లక్షల మందికి 289.68 కోట్ల రూపాయలు,2019-20 రబీ సీజన్ కు సంబంధించి 5.59 లక్షల మందికి 92.38 కోట్ల రూపాయలు, 2020 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 6.67 లక్షల మంది రైతులకు 112.70 కోట్ల రూపాయలు జమ చేసింది ఏపీ సర్కార్. దీనికి అర్హత ఉండి ఎవరికైనా నగదు రాకుంటే నేరుగా ఆర్.బి.కెల్లో లేదంటే గ్రామ సచివాలయాల్లో ఉన్న అధికారులను సంప్రదించాలని సీఎం జగన్ అన్నారు.
also read: