ప్రస్తుతం చాలా మందికి సోషల్ మీడియా ఓ వ్యసనంలా మారిపోతున్నారు. కొంత మంది సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతుంటే.. మరికొందరూ సోషల్ మీడియాలో చేరుతున్నారు. ప్రపంచం మొత్తం ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ వంటి వాటితో గడిపేస్తున్నారు. ముఖ్యంగా వీటి వల్ల కొంత లాభం ఉంటే.. మరికొంత నష్టం ఉందనే చెప్పాలి. ఇక ఈ మధ్యన సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీస్, సాధారణ ప్రజల మధ్య కమ్యూనికేషన్ పెరిగింది. సెలబ్రెటీస్ అయితే సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్ తమ అభిమానులతో పలు విషయాలను పంచుకుంటున్నారు.
Advertisement
ఓ వైపు సినీ ప్రముఖులు సోషల్ మీడియా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంటే.. మరికొందరూ నటీనటులు మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. అందులో తమిళ స్టార్ హీరో అజిత్ ఒకరు అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న ఈ స్టార్ హీరో సోషల్ మీడియాకి దూరంగానే ఉంటున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి హీరోయిన్ షాలిని కూడా నెట్టింటికి దూరంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా చాలా సినిమాల్లో బాలనటిగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది షాలిని. అజిత్ తో పెళ్లి తరువాత షాలిని పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది.
Advertisement
Also Read : ఈ ఏడాది దారుణంగా ట్రోల్స్ వచ్చిన 10 సినిమాలు…దానికి కారణాలు ఇవే…!
తాజాగా షాలిని సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ స్టాలో ఖాతా ఓపెన్ చేసింది. Shaliniajithkumar2022 అనే ఐడీతో ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. తన భర్త అజిత్ తో కలిసి దిగిన ఫోటోలను ఫస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెట్టింట్లో అడుగుపెట్టిందో లేదో అప్పుడే 50వేలకు మంది ఫాలో అవ్వడం విశేషం. షాలిని సోషల్ మీడియాకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె చెల్లెలు హీరోయిన్ షామిలి కంగ్రాట్స్ చెప్పింది. మరోవైపు అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తునివు. ఈ సినిమా ని బోనీ కపూర్ నిర్మిస్తుండగా.. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : చంద్రమోహన్ కూతుళ్లు ఎంత అందంగా ఉన్నారో చూశారా…? ఛాన్స్ వచ్చినా ఎందుకు సినిమాల్లో నటించలేదంటే..?