Home » ఈ ఏడాది దారుణంగా ట్రోల్స్ వచ్చిన 10 సినిమాలు…దానికి కారణాలు ఇవే…!

ఈ ఏడాది దారుణంగా ట్రోల్స్ వచ్చిన 10 సినిమాలు…దానికి కారణాలు ఇవే…!

by AJAY
Ad

ఒకప్పుడు సినిమా సరిగా లేకపోతే చూసిన తర్వాత డైరెక్టర్ ను హీరోను తిట్టుకునే వాళ్ళు. డబ్బులు వృధా అయ్యాయి అని బాధపడి స్నేహితులతో చెప్పుకుని తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు భారీ అంచనాలు పెంచి సినిమా నచ్చకపోతే ప్రేక్షకులు సోషల్ మీడియాలో బహిరంగంగా తిట్టేస్తున్నారు. అంతేకాకుండా మీమ్స్ పేజీల్లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలా ఈ ఏడాది ప్రేక్షకులు ఓ పది సినిమాల పై ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…..

Also Read:  పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో తెలుసా..?

Advertisement

ఈ ఏడాది ఎక్కువగా ట్రోల్ అయిన సినిమాల్లో మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ఒకటి. ఈ సినిమా విజువల్స్ పరంగా దారుణంగా ట్రోల్స్ కు గురైంది. అదేవిధంగా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాపై మొదట అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే.

khiladi review

khiladi review

అంతేకాకుండా ఈ సినిమాలో అనసూయ లుక్ మరియు సినిమాకు ముందు డైరెక్టర్ కు నిర్మాత కాస్ట్లీ కార్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల సినిమాపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో…. సినిమా కథ విషయంలో దారుణంగా ట్రోల్స్ కు గురైంది.

Advertisement

RADHESHYAM FIRST REVIEW

RADHESHYAM

ప్రభాస్ హీరోగా నటించిన రాదేశ్యామ్ సినిమా సైతం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సైతం కథ విషయంలో దారుణంగా ట్రోల్స్ కు గురైంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావలసినవాడ్ని సినిమా పై సైతం ఈ ఏడాది ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం చేసిన ఓవరాక్షన్ వల్ల ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి.

Also Read:  చనిపోయిన వారు కలలో కనిపిస్తే.. దేనికి సంకేతమంటే..!!

నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమాపై సైతం ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. కానీ ఈ సినిమా అంతా సోదిగా అనిపించడంతో దారుణంగా ట్రోల్ చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాపై మొదట భారీ అంచనాలు పెంచారు.. సినిమాలో హాలీవుడ్ నటుడు బాక్సర్ మైక్ టైసన్ ను కమెడియన్ గా చూపించడం, సినిమా క్లైమాక్స్ …విజయ్ ఓవరాక్షన్ ఇతర విషయాల్లో సినిమాపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.

మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాపై ఏ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కలెక్షన్లు మరియు మంచు విష్ణు సన్నీలియోన్ పాయల్ రాజ్ పుత్ తో చేసిన వీడియోల వల్ల సినిమాపై ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి.

Also Read: చంద్ర‌మోహ‌న్ కూతుళ్లు ఎంత అందంగా ఉన్నారో చూశారా…? ఛాన్స్ వ‌చ్చినా ఎందుకు సినిమాల్లో న‌టించ‌లేదంటే..?

Visitors Are Also Reading