Chandra Mohan Daugther Sabitha: సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఉండటం చాలా కామన్. స్టార్ హీరోల నుండి కమెడియన్ ల వరకూ ఇలా ప్రతిఒక్కరి వారసులు సినిమాలపై ఆసక్తి ఉంటే ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే అందులో కొంతమంది సక్సెస్ అయితే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలో నిలబడలేక వెనకడుగు వేస్తారు. కాగా ఒకప్పుడు హీరోగా నటించి ఆ తరవాత వందల చిత్రాలలో ముఖ్యమైన పాత్రల్లో నటించిన నటుడు చంద్రమోహన్ ఫ్యామిలీ నుండి మాత్రం ఎవరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు.
Advertisement
Also Read: టాలీవుడ్ హీరోలపై సీరియస్ అయినా జస్టిస్ ఎన్వి రమణ.. తప్పేంటంటే..?
Chandra Mohan Daugther Sabitha
చంద్రమోహన్ రంగులరాట్నం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత 175 సినిమాలలో ఆయన హీరోగా నటించాడు. అంతే కాకుండా చంద్రమోహన్ 900లకు పైగా చిత్రాలలో నటించారు. అయితే అన్ని చిత్రాలలో నటించిన చంద్రమోహన్ తన ఇద్దరు కూతుళ్లు మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయం పై చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: హీరో అవ్వాల్సిన ఆ వ్యక్తి మోహన్ బాబు వల్ల ట్రావెల్స్ ఓనరయ్యాడు.. ఎలా..?
Advertisement
Chandramohan daughter
తనకు ఇద్దరు అమ్మాయిలు అని ఇద్దరూ బాగుంటారని చెప్పారు. అందులో చిన్న కూతురు ఇంకా అందంగా ఉంటారని అన్నారు. వాళ్లను చిన్నప్పుడు చూసిన నటి భానుమతి ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పరిచయం చేద్దామని అడిగారని చెప్పారు. కానీ తాను దానిని సున్నితంగా తిరస్కరించానని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.
సినిమాల్లో నటించడం వల్ల తనకు పిల్లలతో నటించే సమయం ఉండేది కాదని చెప్పారు. అప్పుడప్పుడూ తన భార్య పిల్లలను షూటింగ్ దగ్గరకు తీసుకుని వచ్చేవారని అన్నారు. వాళ్లకు సినిమా షూటింగ్ చూపిస్తే మళ్లీ ఎప్పుడు తీసుకెళతావ్ అని అడుగుతారని భయం వేసేదని చెప్పారు. సినిమాల ప్రభావం వారిపై పడకుండా పెంచాలని అనుకున్నట్టు చెప్పారు. ఇద్దరూ చదువుల్లో రానించారని గోల్డ్ మెడలిస్ట్ లు అని సంతోషం వ్యక్తం చేశారు.
Advertisement
Also Read: హీరో కృష్ణ పై NTR అంత కక్ష కట్టారా.. ?