సినిమా వాళ్ల జీవితాలు కలర్ ఫుల్ గా ఉంటాయని అందరూ అనుకుంటారు. అయితే అందరి లానే వారి జీవితాలలోనూ కష్టాలు ఉంటాయి. డబ్బులు హోదా ఉన్నప్పటికీ కుటుంబ సమస్యలు ఆర్థికఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. కాగా తాజాగా సీనియర్ నటి లక్ష్మి గురించి కూడా నెట్టింట కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. లక్ష్మి చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి: Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి
Advertisement
ఆ తరవాత హీరోయిన్ గానూ తెలుగుతో పాటూ తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. హీరోయిన్ గా అనుకున్నమేర సక్సెస్ అవ్వలేదు …ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లక్ష్మి అనేక చిత్రాలలో నటించింది. కాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరవాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. లక్ష్మీ మురారి సినిమాలో నటించి తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read: గర్భిణులు పుట్టగొడుగులు తింటే మంచిదేనా ?
Advertisement
ఇక రీసెంట్ గా ఓబేబి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఓ బేబీ సినిమాలో లక్ష్మి ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే లక్ష్మి పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే భాస్కర్ అనే వ్యక్తితో మొదట వివాహం జరిగింది. ఆ తర్వాత కూడా లక్ష్మీ సినిమాలలో నటించింది. కానీ ఆమె సినిమాలో నటించడం భర్తకు ఇష్టం లేదట. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి….
ఈ క్రమంలో ఐదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న లక్ష్మి మలయాళ నటుడు మోహన్ ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే వీరిద్దరూ సైతం విడిపోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఏడేళ్లకు 1987లో శివచంద్రన్ అనే నటుడిని లక్ష్మి పెళ్లి చేసుకున్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇప్పటికీ సినిమాలలోనే కొనసాగుతున్నారు.
Also Read: ‘హనుమాన్’ సినిమాకి గ్రాఫిక్స్ డిజైన్ చేసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!