Home » గర్భిణులు పుట్టగొడుగులు తింటే మంచిదేనా ? 

గర్భిణులు పుట్టగొడుగులు తింటే మంచిదేనా ? 

by Anji

పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి అని పలువురు చెబుతుంటారు. కానీ వీటిని సరైన పుట్టగొడుగులు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషపూరితమైన పుట్టగొడుగులు ఉంటాయి. అవి తింటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. తినగలిగేవి మాత్రమే ఎంచుకుని తినడం ఉత్తమం. గర్భిణీలు పుట్టగొడుగులు తినవచ్చా ? సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో ఇంట్లో వాళ్లకు బాగా అవగాహన ఉండాలి. మంచివే అయినా గర్భిణుల ఆరోగ్యానికి చెడు చేస్తాయేమో ఆలోచించుకోవాలి. తెలిసి తెలియక కొన్నింటిని తీసుకుంటే తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా ప్రమాదం. ఇంతకీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పుట్టగొడుగులు తినొచ్చో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 

ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారంటే.. పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. గర్భిణీ మహిళలు వీటిని ఆహారంగా తీసుకుంటే ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పుట్టగొడుగులు చాలా ముందంజలో ఉంటాయి. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులను తినవచ్చు. ఇవి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం చాలా అవసరం.  

Also Read :   Chanakya Niti : అలాంటి గురువుని త్వరగా వదిలేయండి.. లేకపోతే నష్టమే..!

పుట్టగొడుగుల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు 

  • సాధారణంగా మార్కెట్ లలో చాలా రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉంటాయి.వీటిలో పారాసోల్ పుట్టగొడుగులు, ఫాల్స్ మోరల్స్ పుట్టగొడుగులను తినకూడదు. 
  • పుట్టగొడుగులను ఎప్పుడూ పరిమిత మోతాదులో మాత్రమే తినాలి. ఆరోగ్యానికి మంచివి కాదా అని అదే పనిగా అస్సలు తినకూడదు. వీటిని నీళ్లతో బాగా శుభ్రం చేసి ఉడికించి తినాలి. పచ్చిగా మాత్రం అస్సలు తినకూడదు. 
  • ముఖ్యంగా పుట్టగొడుగులు తాజాగా ఉన్నప్పుడే తినాలి. నిలువ ఉన్న వాటిలో పురుగులు చేరే అవకాశం ఉంటుంది. ఆ పురుగులు కంటికి కూడా కనిపించకపోవచ్చు. తాజాగా ఉన్న వాటినే కొనుక్కొని వండుకొని తినాలి. 
  • గర్భిణులు తినొచ్చు ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. కానీ మీ ఆరోగ్యాన్ని బట్టి ఇవి తినడం మంచిదో కాదో.. రెగ్యులర్ గా వెళ్లే వైద్యులను సంప్రదించిన తరువాత తినడం బెటర్. డాక్టర్ సలహా మేరకు తింటే గర్భిణులు ఆరోగ్యాలు మంచిది. 

Also Read :   మీ శరీరంలో ఈ భాగాల్లో నొప్పులున్నాయా ? కాన్సర్ రావొచ్చు జాగ్రత్త..!

Visitors Are Also Reading