Home » ‘హనుమాన్’ సినిమాకి గ్రాఫిక్స్ డిజైన్ చేసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

‘హనుమాన్’ సినిమాకి గ్రాఫిక్స్ డిజైన్ చేసింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “హనుమాన్” టీజర్ జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకు కారణం ఈ చిత్రంలోని వీఎఫ్ఎక్స్. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని తలదన్నే విధంగా అద్భుతంగా ఉన్నటువంటి ఈ గ్రాఫిక్స్ క్రియేట్ చేసింది హైదరాబాద్ కి చెందిన ‘హేలో హ్యూస్ స్టూడియోస్’ సంస్థ కావడంతో ఇప్పుడూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

Advertisement

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ కంటే ‘హనుమాన్’ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయని టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. హేలో హ్యూస్ స్టూడియోస్ ని ప్రస్తుతం అందరూ ప్రశంసిస్తున్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రశాంత్ వర్మ సినిమాటెక్ యూనివర్స్ తో కలిసి ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఎన్ఆర్ఐ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.  

Advertisement

Also Read :  మొద‌టి భ‌ర్త‌తో విడాకుల త‌ర‌వాత మ‌రో రెండు పెళ్లిళ్లు..నటి ల‌క్ష్మి జీవితం గురించి ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు.!

Hanuman Teaser: హనుమాన్ టీజర్ పై లెజండరీ దర్శకుడు ప్రశంసలు.. తమిళ్  డైరెక్టర్ అట్లీ సైతం ఫిదా.. | Seniour Director Singeetham Srinivasa rao And  kollywood director atlee appreciates hanuman ...

అంజనాద్రి ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు హిందీ డిజిటల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు జీ నెట్ వర్క్ సొంతం చేసుకోవడం విశేషం. ఇక నుంచి వీఎఫ్ఎక్స్ కు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు నిర్మించే పనిలో ఉన్న దర్శకులందరూ హేలో స్టూడియోని సంప్రదించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read :  టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి విజ‌య కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..? ఏం చేస్తుందంటే..?

Visitors Are Also Reading