టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబులో ఏదో మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు కూల్ గా, క్యూట్ గా ఉంటే సూపర్ స్టార్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా జిమ్ లో వర్క్ అవుట్స్ చేయడం, ఫిజిక్ ని పల్చగా మార్చుకోవడం పై పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు త్రివిక్రమ్ తో రెండో షెడ్యూల్ స్టార్ట్ అయితే యాక్షన్ సీన్ల కోసం కసరత్తులు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాలకు దర్శకత్వం వహించాడు. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమా SSMB 28 చిత్రం తెరకెక్కుతుంది. మహేష్ జిమ్ లో కసరత్తు గురించి ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతోంది.
Advertisement
గతంలో సుకుమార్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన వన్ సినిమా కోసం ఇదే తరహాలో బాగా రిస్క్ చేసి సిక్స్ ప్యాక్ చేశాడు సూపర్ స్టార్. షార్ట్ హెయిర్ స్టైల్ తో క్యూట్ గా ఉంటే మహేష్ ఇప్పుడు లాంగ్ హెయిర్ స్టైల్ మెయిన్ టెన్ చేస్తున్నాడు. గతంలో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన అతిధి సినిమా కోసం మహేష్ ఇదే స్థాయిలో జుట్టు పెంచుకున్నాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అదే విధంగా నేనొక్కడినే మూవీ కూడా అదే స్థాయిలో నిరాశపరిచింది.ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కారు వారి పాట సినిమా కోసం కూడా మహేష్ ఫిట్ నెస్, హెయిర్ స్టైల్ పరంగా చాలా కేర్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది.
Advertisement
కేవలం ఏజ్ కనిపించకుండా ఉండేందుకే ఇదంతా చేస్తున్నాడని టాక్ మాత్రం వినిపిస్తోంది. రీసెంట్ గా సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవిని కోల్పోయిన మహేష్ బాబు హెల్త్ ఈజ్ వెల్త్ అని నమ్ముతున్నారని.. అందుకే రెగ్యులర్ గా తన ఫిజిక్ ని స్లిమ్ గా ఉండేందుకు జిమ్ములో ఎక్సర్ సైజులు, స్విమ్మింగ్ తో పాటు ఫ్యామిలీతో వెకేషన్ ట్రిప్స్ వేస్తున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడున్న యంగ్ స్టార్స్ లో టాప్ త్రీలో టాలీవుడ్ సూపర్ స్టార్ ఉంటాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే మహేష్ బాబు లుక్కు సడన్ గా మారిపోవడంపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మహేష్ గెటప్ మారడానికి కారణం ఏమై ఉంటుందో తెలియాలంటే ఆయన చెప్పేవరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు కొందరు అభిమానులు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.
Also Read : అర్జున్ తో పెళ్లికి మున్నీ ఓకే చెప్పేసిందా? సోషల్ మీడియాలో వైరల్..!