రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలీవరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను అభిమానులను సంపాదించుకున్న కథానాయకుడు కృష్ణంరాజు. గత నెలలో అనారోగ్యంతో కన్ను మూశారు. కేంద్రంలో వాజ్ పేయ్ మంత్రి వర్గంలో కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. మొగల్తూరులో కుటుంబ సభ్యులు సంస్మరణ సభన ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి, కూతుర్లు, ప్రభాస్ పాల్గొన్నారు.
Advertisement
కృష్ణంరాజు మరణంతో కుటుంబానికి సంబంధించి శ్యామలాదేవి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన ఆస్తి పై పూర్తి అధికారాలు ప్రభాస్ కి వచ్చేలా వీలునామానురాయించిందట. అదేవిధంగా చెల్లెలు పెళ్లిళ్లు పూర్తి బాధ్యత కూడా ప్రభాస్ అనే చూసుకునే విధంగా ఆమె రాయించినట్టు సమాచారం. కూతుర్ల పెళ్లి బాధ్యతలు మొత్తం కూడా ప్రభాస్ చూసేలా ఆమె డెసిషన్ తీసుకున్నారట. కృష్ణంరాజు ఇంటికి ఇకనుంచి ప్రభాస్ పెద్దదిక్కు కంటూ కమలాదేవి తన వీలునామాలో రాయించారట. తనకి ఏది జరిగినా సరే తన ఆస్తి మొత్తం ప్రభాస్‌కి చెందేలా ఆమె వీలునామా రాయించారట. దీంతో ఒక్కసారిగా కూతుర్లు సైతం షాక్ అయినట్టు సమాచారం.
Advertisement
Also Read : హీరో అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాకే..!
ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి తీసుకున్న నిర్ణయం సరైనదే అంటున్నారు ప్రభాస్ అభిమానులు. పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ కు పెద్ద బాధ్యతలే వచ్చి పడ్డాయి. నలుగురు చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ దే. పెదనాన్న కుటుంబాన్ని కూడా తన కుటుంబంగానే చూసుకుంటున్నాడు ప్రభాస్. కష్టం వేళ వారికి అండగా ఉన్నాడు. ప్రభాస్ కూడా కృష్ణంరాజుతో సెక్షన్ చాలా ఎక్కువ వీరిద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. చివరిసారిగా కృష్ణంరాజు ప్రభాస్ తో కలిసి రాదేశ్యామ్ చిత్రంలో నటించారు.
Also Read : అల్లు అరవింద్ బాటలో దిల్ రాజు.. సక్సెస్ అయ్యేనా ?