Home » హీరో అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాకే..!

హీరో అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాకే..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు హీరో అర్జున్. మా పల్లెలో గోపాలుడు అనే మూవీతో ఇండస్ట్రీలోకి మొదటిసారి అడుగు పెట్టారు. తెలుగు సినిమాల్లోకి రాకముందే పలు కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పుట్టి పెరిగింది కన్నడలోనే అయినా సౌత్ భాషలన్నింటిలో మంచి పేరుంది. కేవలం నటుడు గానే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఎంతో పేరున్న మనిషి. ఇప్పటివరకు ఎవరితో విభేదాలు కూడా పెట్టుకోలేదు. తన తోటి హీరోలు సైతం మెచ్చిన నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

Advertisement

ఇక అర్జున్ తండ్రి కూడా నటుడే కానీ అర్జున్ కి నటుడవ్వడం ఇష్టం లేదు. పోలీస్ అవ్వాలని కోరిక ఉండేదట. అతడి అన్న కిషోర్ సార్జా సినిమా డైరెక్టర్. ఈ విధంగా అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చారు అర్జున్. అర్జున్ నివేదిత అనే హీరోయిన్ ని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కుమార్తెలు.పెద్దమ్మాయి ఐశ్వర్య సైతం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత తండ్రి ఇచ్చిన ఆస్తులతో పాటు ఆయన కూడా బాగానే కూడబెట్టారు. అర్జున్ హనుమాన్ భక్తుడు.

Advertisement

also read:సమంత నటించిన యశోధ సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా ?

అందుకే 35 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంతో ఒక హనుమాన్ గుడిని కట్టిస్తున్నాడు.తన కెరీర్ మొత్తం 150 కి పైగా సినిమాల్లో నటించిన అర్జున్ బాగానే సంపాదించారు. ఆయన మొదట నటించిన సినిమా 30 వేల పారితోషికం అందుకోగా, ఆ తర్వాత ఒక్క సినిమాకు 7 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారట. గ్యారేజ్ లో ఐదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. దాదాపుగా వీటి విలువ 5 కోట్ల పైగానే.. ఇక మధుగిరి కర్ణాటకలో ఆయనకు 15 కోట్ల విలువ గల ఇల్లు ఉంది. ఇక తన భార్య, కూతుళ్ళ పేర్ల మీద అలాగే ఇతర ఆస్తులతో కలిపి 300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

also read:

Visitors Are Also Reading